'వారిపై అనర్హత వేటు వేస్తేనే అసెంబ్లీకి వస్తాం'

Updated By ManamSun, 03/04/2018 - 11:44
YSRCP, AP speaker, Vijayasai reddy

YSRCP, AP speaker, Vijayasai reddy, విజయవాడ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తేనే ఎల్లుండి అసెంబ్లీకి వస్తామని వైసీపీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. రెండు విషయాలపై రెండోసారి వినతిపత్రమిచ్చామని చెప్పారు. 22మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే  ఈ నెల 6న అసెంబ్లీకి హాజరవుతామని తేల్చి చెప్పారు. రెండేళ్లకు పైగా శిక్ష పడ్డ చింతమనేని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా పేర్కొన్నారు. చింతమనేని స్థానాన్ని ఖాళీగా పేర్కొంటూ స్పీకర్ నోటిఫై చేయాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం స్పీకర్ వ్యహరించాలన్నారు. మూడో కూటమిపై కేసీఆర్ స్పష్టంగా మాట్లాడలేదని విమర్శించారు. అవిశ్వాసం చీప్ ట్రిక్స్ అని కేసీఆర్ అనడంపై పవన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 21న అవిశ్వాసం సరికాదంటున్న పవన్ ఎప్పుడు పెట్టాలో చెప్పాలని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

English Title
Ysrcp demands to disqulify of MLAs AP speaker
Related News