పార్లమెంట్ వద్ద వైఎస్సార్ సీపీ నేతల ధర్నా

Updated By ManamThu, 07/19/2018 - 11:41
ysrcp leaders protest

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు ధ్వజమెత్తారు. రెండురోజు కూడా వీరు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ  ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణలు నిరసన చేపట్టారు. 

ఈ నాలుగేళ్లుగా చంద్రబాబు ఏం చేశారని, ఇప్పుడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఆయన ద్వంద్వ వైఖరినికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. అవిశ్వాసంపై  చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీజేపీ, టీడీపీలు కలిసి లాలుచీ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

English Title
ysrcp former mps protest Continues For Second Day at parliament
Related News