చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల బహిరంగ లేఖ

Updated By ManamWed, 09/05/2018 - 15:46
ysrcp mlas writes open letter to AP CM chandrababu naidu
ysrcp mlas writes open letter to AP CM chandrababu naidu

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన 22మంది ఎమ్మెల్యేలపై చర్య తీసుకుంటే... తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతామంటూ... వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని స్పీకర్ కోరారని, అయితే నలుగురు మంత్రులు, ఫిరాయింపు ఎమ్మెల్యేలను పదవుల నుంచి తొలగిస్తే రేపటి నుంచి శాసనసభకు హాజరు అవుతామని స్పష్టం చేశారు. కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

English Title
ysrcp mlas writes open letter to AP CM chandrababu naidu
Related News