హోదా కోసం వైసీపీ సంచలన నిర్ణయం

Updated By ManamSat, 03/31/2018 - 19:25
YSRCP MPs Indefinite Hunger Strike

YSRCP MPs Will Sit for Indefinite Hunger Strike Says YS Jagan

గుంటూరు: పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడగానే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజ‌క వ‌ర్గం పేరేచెర్ల‌ ‘ప్రజా సంకల్పయాత్ర’లో భాగంగా బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. రాజీనామా అనంతరం నేరుగా ఏపీ భవన్‌కు వెళ్లి ఎంపీలు ఆమరణ దీక్షకు దిగుతారని ఆయన చెప్పారు. వైసీపీ ఎంపీలంతా స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామాలు సమర్పిస్తారన్నారు. ఎంపీల దీక్షకు మద్దతుగా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు దీక్షకు దిగుతాయని జగన్ తేల్చిచెప్పారు. కాలేజీల్లో విద్యార్థులు కూడా రిలే దీక్షలు చేపట్టి సంఘీభావం తెలపాలని ఈ సందర్భంగా వైసీపీ అధిపతి పిలుపునిచ్చారు. మరోవైపు టీడీపీ ఎంపీలు కూడా తమ పదవులకు రాజీనామా చేసి మద్దతివ్వాలన్నారు. 

హోదా మనకు ఊపిరి కాబట్టి.. టీడీపీ పార్టీ ఎంపీలు రాజీనామా చేసినా చేయకపోయినా పార్లమెంట్ చివరి రోజున వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ స్పష్టం చేశారు. కాగా ఇటీవల జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా పార్టీ ఎంపీలతో సమావేశమైనప్పుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇందులోనే భాగంగా ఇప్పటికే వైసీపీ ఎంపీలు రాజీనామా లేఖలపై సంతకాలు కూడా పెట్టిన సంగతి విదితమే. మొత్తానికి చూస్తే హోదా కోసం పోరాటం చేస్తున్న వైసీపీ అధినేత జగన్ తాజా నిర్ణయం మరింత వేడెక్కించారని చెప్పుకోవచ్చు. ఓ వైపు ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్న తరుణంలో.. జగన్ కూడా పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

English Title
YSRCP MPs Will Sit for Indefinite Hunger Strike Says YS Jagan




Related News