వైసీపీ ఎంపీల ఆరోగ్యం సర్లేదు: అనంత

Updated By ManamTue, 04/10/2018 - 14:44
Anantha Venkatarami Reddy

YSRCP Sr Leader Anantha Venkatarami Reddy Over MPS Hunger Strike

అనంతపురం: ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదని వైసీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన.. "కేంద్రం తన వైఖరి చెప్పడం లేదు. వెంకయ్యనాయుడు ఆనాడు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. సభలో ఇచ్చిన హామీ అమలుపై వెంకయ్య జోక్యం చేసుకోవాలి. ప్రత్యేక హోదాపై టీడీపీ చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి హోదా అంశం వాడుతున్నారు. తక్షణమే టీడీపీ ఎంపీలతో చంద్రబాబు రాజీనామా చేయించాలి" అని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే.. ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలిస్తే ఎమ్మెల్యేలమంతా రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అన్నారు. మంచి ఆశయం కోసం వైసీపీ ఎంపీలు చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేస్తున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

English Title
YSRCP Sr Leader Anantha Venkatarami Reddy Over MPS Hunger Strike
Related News