నమ్మిన సిద్ధాంతం కోసం, చేరదలచిన లక్ష్యం కోసం, అడ్డంకులనూ, అవరోధాలనూ లక్ష్యపెట్టని సాత్విక సాహసి. నూతనత్వం కోసం అన్వేషించే సుప్రతిష్ఠితుడు. అంతరాంతరాల్లో అచ్చయిన విప్లవకవి ‘‘పఠాభి’’.
ఇది శ్రీ దేవన చంద్రశేఖర్ చేసిన పరి శోధన గ్రంథం ‘‘బుద్ధవచన ప్రామాణికత’’. దీనిని పీకాక్ బుక్స్ హైదరాబాద్ వారు ప్రచురించారు. మొన్న జనవరిలో విజయవా డ 29వ పుస్తక మహోత్సవంలో కొద్దిమంది మిత్రుల మధ్య ఆవిష్కరించటం జరిగింది.
తెలుగు కవితారంగాన్ని సుమారు మూడు దశాబ్దాలుగా, ఏకఛత్రాధిపత్యంగా ఏలిన భావకవిత్వం గతానుగతికమై, క్రమంగా ప్రవాహగతిని కోల్పోయి, నిలువ నీటికాసారంగా మిగిలిపోయిన రోజుల్లో, కవిత్వంలో కొత్తదారులు అన్వేషించిన వారిలో పఠాభి ముఖ్యులు
కులంపేరుతో అలుముకున్న చీకట్లను పార దోలేందుకు హైదరాబాద్ గడ్డపై పొడిచిన పొద్దు, వెలుగుచుక్కై వెలుగు పంచింది. దళిత జాతికి భా గ్యరేఖ అయింది. ఆ భాస్కరుడే దక్కన్ దళిత ఉ ద్యమ వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ. రచయితగా, ప్రతికా నిర్వహకునిగా, ...
నేను చెప్పేదే నిజం, నువ్వు చెప్పేదానిలో వాస్తవం లేదు... అందువల్ల నీ మాటలు నమ్మశక్యం కావు, అసంబద్ధైవెునవి - అనే విపరీత సాపేక్షవాదంతోనే అసలు సమస్యలొస్తాయి. ‘సత్యానంతర’ (పోస్ట్ ట్రూత్) అనే పదమే విభిన్నైవెునది
ముదనష్టపు వెధవలు, పావలా లోనుకి కూడా రూపాయి ష్యూరిటీ వెతుకుతారు. వేల కోట్లు దర్జాగా ఎత్తుకుపోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఇప్పుడు పీక్కుంటే ఏమొస్తుంది, సారువాడు వదిలేసిన పాన్ పరాగ్ ప్యాకెట్టు తప్ప..
తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహ న్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీలో కలకలం రేకెత్తించినట్టు కనిపిస్తోంది.
ఆధునిక భారత దేశ చరిత్రకు స్కాంలే మైలురాళ్లుగా నిలిచాయనిపిస్తోంది. 1948లో వి.కె. కృష్ణమీనన్ ప్రొటోకాల్ పక్కనపెట్టి ఒక విదేశీ సంస్థతో రూ.80 లక్షల రూపాయల జీపుల కొనుగోలు ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి యూపీ ఏ హయాంలో 2జీ, కామన్‌వెల్త్ గేమ్స్, నేడు రాఫెల్ యుద్ధవిమానాల కొను గోళ్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) మోసం దాకా వివిధ రకాల స్కాం లు ప్రభుత్వ విధానాలకు అద్దం పడుతున్నాయి
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఓ ప్రబల రాజకీయ శక్తి. దేశ వ్యాప్తంగా మంచి ఆకర్షణ ఉన్న ప్రజాయోధుడు. తెలంగాణ మహాత్ముడు..! ప్రజల్లో వెలుగు లను..ఆకాంక్షలను నింపిన సూరీడు
దేశంలోనూ, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టులు  ఐక్యం కావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో రాజకీయ, సామాజిక ఉద్యమాలు నిర్వ హించి, తాడిత, పీడిత, నిరుపేదలు, బాధితులు  పక్షాన నిలిచి సిద్ధాంతానికి కట్టుబడి నిబద్ధతతో పనిచేసే కమ్యునిస్టులు నవ్యాంధ్ర శాసనసభలో స్థానం సంపాదించుకోలేక పోవడం బాధాకరం.

Related News