సిమెంట్ తయారీ సంస్థ ఎ.సి.సి లిమిటెడ్ సెప్టెంబర్ 30తో ముగిసిన మూడో త్రైమాసికానికి 15.20 శాతం పెరుగుదలతో రూ. 209.14 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యు.ఇ.ఎఫ్) 2018 సంవత్సరానికి రూపొందించిన ప్రపంచ పోటీ సామర్థ్య సూచీలో ఇండియా 58వ అత్యంత పోటీదాయక ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్.బి.ఐ) డిజిటల్ సర్వీస్ ప్లాట్‌ఫాం ‘యోనో’ అక్టోబర్ 16న ఆరు రోజుల షాపింగ్ ఉత్సవం ప్రారంభించింది.
ఫ్రెంచ్ ఇంధన రంగ దిగ్గజం టోటల్ ఎస్.ఏ, భారతదేశపు అదానీ గ్రూప్ కలసి సంయుక్తంగా ఒడిశాలోని ధమ్రా వద్ద లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ (ఎల్.ఎన్.జి) రీగ్యాసిఫికేషన్ టెర్మినళ్ళను, రానున్న 10 ఏళ్ళ కాలంలో 1500 సర్వీస్ స్టేషన్ల రిటైల్ వ్యవస్థకు ఇంధనాన్ని అందించే ఏర్పాట్లను నిర్వహించనున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ జూలై-సెప్టెంబర్ కాలానికి ఇంతవరకు ఏ త్రైమాసికంలోనూ ప్రకటించనంత అత్యధిక నికర లాభాన్ని ప్రకటించింది.
బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ)కి గీటురాయిగా భావించే ‘సెన్సెక్స్’ మూడు రోజుల లాభాల ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో పెరుగుతూ వచ్చిన ఎగుమతులు 2018 సెప్టెంబర్‌లో ఎగుమతులు (గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే) 2.15 శాతం తగ్గి, 27.95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగంలో దేశంలో రెండవ పెద్ద సంస్థ అయిన ఇన్ఫోసిస్ సెప్టెంబర్ త్రైమాసికంలో 10.3 శాతం పెరుగుదలతో రూ. 4,110 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.
పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి అమలు ప్రభావాల నుంచి దేశం కోలుకున్నందున భారతదేశంలో ఉక్కు డిమాండ్ తిరిగి అధిక వృద్ధి గతిలోకి మరలగలదని ఈ రంగ పరిశ్రమలకు చెందిన ప్రపంచ సంస్థ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ (వరల్డ్ స్టీల్) మంగళవారం వెల్లడించింది.
మౌలిక వసతుల దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రోకు చెందిన ఎల్ అండ్ టి హెవీ ఇంజనీరింగ్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదనంగా రూ. 1050 కోట్ల విలువైన ఆర్డర్లు సంపాదించింది.


Related News