శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Updated By ManamWed, 09/12/2018 - 21:02
Andhra Pradesh, Brahmotsavams, Srivari Temple, Lord Venkateswara

Andhra Pradesh, Brahmotsavams, Srivari Temple, Lord Venkateswaraతిరుమల: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణలో భాగంగా బుధవారం తిరువీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మకరలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది.

అదేరోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. గురువారం రాత్రి 8గంటలకు పెద్దశేష వాహనసేవ నిర్వహించనున్నారు. పెద్ద శేష వాహన సేవతో శ్రీవారి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. 

English Title
Andhra Pradesh All set for Brahmotsavams from Thursday
Related News