జర్మనీ సారథ్య పగ్గాలు మళ్లీ ఆమెకే..

Updated By ManamWed, 03/14/2018 - 16:56
angela merkal

Angela Merkalజర్మనీ నాయకత్వ పగ్గాలు మళ్లీ ఆమే చేపట్టనున్నారు. జర్మనీ ఛాన్సలర్‌గా నాలుగో సారి ఏంజెలా మెర్కెల్ ఎన్నికయ్యారు. జర్మన్‌ పార్లమెంటు సభ్యులు బుధవారం మరోసారి ఆమెను దేశ ఛాన్స్‌లర్‌గా ఏంజెలాను ఎన్నుకున్నారు. 364 సభ్యులు మెర్కెల్‌కు అనుకూలంగా ఓటు వేయగా...315 మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశారు. తొమ్మిది మంది ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. 11 మంది ఎంపీలు ఓట్లు చెల్లని ఓట్లు వేశారు. 63 ఏళ్ల ఏంజెలాకు ఈసారి ప్రభుత్వాన్ని కొనసాగించడం అతిపెద్ద సవాలే కానుంది. పెద్దగా తన పార్టీకి పట్టులేని సోషియల్ డెమోక్రాట్స్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏంజెలా నడిపించబోతున్నారు. 2017 సెప్టెంబరు 24న జర్మనీ పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా...ఛాన్సలర్‌గా ఏంజెలా మెర్కెల్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేందుకు 171 రోజులు నిరీక్షించాల్సి వచ్చింది.

English Title
Angela Merkel elected to fourth term as German chancellor
Related News