20 ఏళ్లు నేనే అధినేత్రిని

Updated By ManamMon, 05/28/2018 - 00:33
bsp chief
  • బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టీకరణ

  • తమ్ముడి ఆశలకు పరోక్షంగా చెక్

mayaలఖ్‌నవ్: బీఎస్పీ అధినేత్రిగా తాను మరో 20-22 ఏళ్లు కొనసాగుతానని మాయావతి స్పష్టం చేశారు. తద్వారా ఎవరు కూడా పార్టీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకోకూడదని పరోక్షంగా స్పష్టం చేశారు. లఖ్‌నవ్‌లో జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేయడం గమనార్హం. అలాగే.. పార్టీ ఉపాధ్యక్షుడైన తన సోదరుడు ఆ పదవిలో అలాగే కొనసాగేందుకు వీలు లేకుండా ఉండేలా పార్టీ రాజ్యాంగంలో పలు సవరణలు చేసినట్లు వెల్లడించారు. అయితే.. పార్టీ అధినేత్రిగా కొనసాగేందుకు తనకు ఎలాంటి అడ్డంకులు ఉండవని, వయసు మీద పడేవరకూ ఆ పదవిలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేశామన్నారు. ఇక ఇతర పార్టీలతో సీట్ల పంపకాల్లో ఏమాత్రం తేడా వచ్చినా సొంతంగా పోటీ చేయడానికి బీఎస్పీ సిద్ధంగా ఉన్నదని కూడా మాయావతి చెప్పారు. గతేడాది తన సోదరుడిని పార్టీలోకి తీసుకోవడానికి బీఎస్పీ రాజ్యాంగంలో మార్పులు చేశానని చెప్పుకొచ్చారు.

English Title
Another 20 Years I am Chief
Related News