నిపా వైరస్‌తో మరొకరి మృతి

Updated By ManamMon, 05/28/2018 - 00:33
virus
  • మరో ఇద్దరి పరిస్థితి విషమం

  • కేరళలో 13కు చేరిన మృతుల సంఖ్య

nipahపలాజీ: కేరళలో ప్రాణాంతక నిపా వైరస్‌తో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ బారిన పడి కొద్ది రోజులుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోజికోడ్ జిల్లా పలాజీ ప్రాంతానికి చెందిన ఎబిన్ (22) పరిస్థితి విషమించి ఆదివారం కన్నుమూశారు. దాంతో.. ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరుకుంది. ఇదే జిల్లాకు చెందిన మరో ఇద్దరికి నిపా వైరస్ ఉందని తేలడంతో వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని అధికారులు తెలిపారు. కాగా, కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. వైరస్ ప్రభావం ఉన్న  కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో ఇప్పటి వరకు 200 మందికి చికిత్స అందించామని తెలిపారు. నిపా వైరస్ సోకినవారికి ఏ విధంగా చికిత్స అందించాలనే విషయంపై ఐదుగురు వైద్య రంగ నిపుణులను ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి పంపి శిక్షణ తీసుకుంటున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా, నిపా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా బిహార్, సిక్కిం, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

English Title
Another one died with Nipah Virus
Related News