అది చిన్న విషయం కాదు: ఏపీ మాజీ డీజీపీ

Updated By ManamMon, 09/24/2018 - 12:28
AP Ex DGP Sambasivarao Reaction On Araku Incident
  • అరకు ఘటనపై స్పందించిన మాజీ డీజీపీ సాంబశివరావు

AP Ex DGP Sambasivarao Reaction On Araku Incident

అమరావతి : అరకు మావోయిస్టుల దారుణ కాండపై ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు స్పందించారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి విశ్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సాంబశివరావు సోమవారమిక్కడ మాట్లాడుతూ..‘సానుభూతిపరులు ఉన్నంతకాలం మావోయిస్టుల ప్రభావం ఉన్నట్లే. ఎప్పుడైనా, ఏమైనా జరగవచ్చు అనే కోణంలో పోలీసులు ఆలోచించాలి. 

ఉనికి కోసం మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. 50మందికి పైగా మావోయిస్టులు ఒక మండలానికి వచ్చారంటే చిన్న విషయం కాదు. మావోయిస్టుల చర్యల పట్ల పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మావోయిస్టుల రియాక్షన్స్ ఊహించుకుని, దానికి అనుగుణంగా వ్యూహాలు రచించుకోవాలి. మావోయిస్టుల అణిచివేతలో సాయం చేసిన చరిత్ర ఏపీ పోలీసులది.’ అని అన్నారు.

English Title
AP Ex DGP Sambasivarao Reaction On Araku Incident
Related News