రాజ్యసభ సభ్యుడిగా జైట్లీ ప్రమాణ స్వీకారం

Updated By ManamSun, 04/15/2018 - 12:41
Arun Jaitley, oath as Rajya Sabha member, special ceremony by Vice-President, ajya Sabha Chairman Venkaiah Naidu

Arun Jaitley, oath as Rajya Sabha member, special ceremony by Vice-President, ajya Sabha Chairman Venkaiah Naiduన్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలోని పార్లమెంట్ ఛాంబర్‌లో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు జైట్లీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 3న ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి జైట్లీ తిరిగి ఎన్నికైన సంగతి తెలిసిందే. పార్లమెంట్ బడ్జెట్ ముగింపు సమావేశాల సమయంలో అనారోగ్యం కారణంగా జైట్లీ ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఎగువ సభకు తిరిగి ఎన్నికైన జైట్లీ.. రాజ్యసభ నేతగా నియమితులయ్యారు. కాగా, గతకొద్దికాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న జైట్లీ.. ఇటీవలే ఎయిమ్స్‌‌లో చికిత్స తీసుకొని గతవారమే డిశ్చార్చి అయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు కూడా పాల్గొన్నారు.

English Title
Arun Jaitley takes oath as Rajya Sabha member
Related News