నేటి రాశిఫలాలు (బుధవారం 14 ఫిబ్రవరి)

Updated By ManamWed, 02/14/2018 - 00:14
astrology

astrologyమేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1)
అన్ని విధాలా బాగుంటుంది. మొక్కులు తీర్చుకుంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయుత్నాలు ఫలిస్తాయి. విందులు, వినోద కాలక్షేపం చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. 

వృషభం

(కత్తిక 2, 3, 4, రోహిణి, మగశిర 1, 2)
ఆదాయానికి లోటు ఉండదు కానీ, ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఎవరికీ గ్యారంటీ ఉండొద్దు. ప్రేమల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. 

మిధునం

(మగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1. 2. 3)
ఆశించిన పనులన్నీ పూర్తవుతాయి. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ప్రేమలు ఫలిస్తాయి. పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లి బాజాలు మోగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్త.
 
కర్కాటకం

(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)   
ఇల్లు మారే ఆలోచన చేస్తారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. బంధువులు ముఖం చాటేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. తల్లి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగిస్తుంది.  

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1, 2, 3)
ఉద్యోగం కారణంగా దూర ప్రయాణాలు సంభవం. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయంతో పాటే ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది.  పెళ్లికి, ప్రేవులకు ఇది సమయం కాదు. 
 
కన్య

(ఉత్తర 4, హస్త, చిత్త 1, 2)
ఆదాయం బాగానే ఉంటుంది. అయితే, ఖర్చులు తగ్గించుకోండి. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగకండి. ప్రేమకు అడ్డంకులు తొలగిపోతాయి. 

తుల

(చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3)
పెళ్లికి ఏర్పాట్లు మొదలుపెడతారు. ప్రేమ వ్యవహారాలు ఫలించే అవకాశం ఉంది. ప్రమోషన్ మీద బదిలీ కావొచ్చు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. పెద్దయెుత్తున షాపింగ్ చేస్తారు. దూర ప్రయాణాలకు పథకాలు సిద్ధం చేస్తారు. ఇల్లు కొనాలనే ఆసక్తి పెరుగుతుంది.  

వృశ్చికం

(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
శుభ కార్యాలకు ప్లాన్లు వేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. ప్రేమల్లో తొందరపాటు తగదు. విదేశాలలో ఉన్న సంతానం నుంచి శుభ వార్తలు వింటారు.  
 
ధనస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అదనపు ఆదాయం కోసం ప్రయుత్నిస్తారు. కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటారు. బంధుమిత్రుల తాకిడి ఎక్కువవుతుంది. ఇల్లు మారే సూచనలున్నాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి బాజాలు మోగవచ్చు. ప్రేవులకు దూరంగా ఉండండి. 

మకరం

(ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2)
ఆదాయం పరవాలేదు. ఖర్చుల్ని అదుపు చేయండి. అనుకున్న పనులు కొన్ని పూర్తవుతాయి. ఉద్యోగం మారడానికి ప్రయుత్నిస్తారు. ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పట ఎక్కువగా ఉంటుంది. 

కుంభం

(ధనిష్ఠ 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3)
ఆదాయపరంగా అనుకూల సమయం. ఆర్థిక సవుస్యల నుంచి క్రమంగా బయుటపడతారు. ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. పెళ్లి బాజాలు మోగుతాయి. పిల్లలు మిమ్మల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రేమలు ఫలిస్తాయి. 

మీనం

(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో పని భారం పెరిగినా తగిన గుర్తింపు లభిస్తుంది. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. దూర ప్రయాణాలకు సిద్ధవువుతారు. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలార్జిస్తారు.

English Title
astrology
Related News