నేటి రాశి ఫలాలు (గురువారం 15 ఫిబ్రవరి)

Updated By ManamThu, 02/15/2018 - 00:26
astrology

astrologyమేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1)
అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విదేశాలకు వెళ్లడం గురించి ఆలోచిస్తారు. ఆదాయం బాగున్నా ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి.

వృషభం

(కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2)
ఆదాయం బాగానే ఉంటుంది. అదనపు ఆదాయం కోసం ప్రయుత్నాలు చేస్తారు. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. గ్యారంటీ ఉండొద్దు. ప్రేమల్లో చిక్కులు తప్పకపోవచ్చు 

మిథునం

(మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1. 2. 3)
భార్య తర ఫు బంధువులతో ఇల్లు కిటకిటలాడుతుంది. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్త.
 
కర్కాటకం

(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)   
బదిలీ సూచనలున్నాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగానే ఉంటుంది. కానీ, శుభ కార్యాల మీద డబ్బులు ఖర్చులు చేస్తారు. బంధువులు ముఖం చాటేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు. 

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1, 2, 3)
తప్పనిసరిగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయుత్నిస్తారు. సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. బంధుమిత్రులు ముఖం చాటేస్తారు. ప్రేవులకు ఇది సమయం కాదు. పిల్లలతో కాలక్షేపం చేస్తారు. 

కన్య

(ఉత్తర 4, హస్త, చిత్త 1, 2)
ఆదాయం, ఆరోగ్యం మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో విందులు వినోదాల్లో గడుపుతారు. పెళ్లి ప్రయుత్నాలు సానుకూలిస్తాయి. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలకు అవరోధాలు తొలగిపోతాయి. 

తుల

(చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3)
వ్యాపార విస్తరణకు ప్రయుత్నాలు ప్రారంభిస్తారు. తీర్థయాత్రలు సంభవం. బదిలీకి అవకాశాలున్నాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త రంగంలోకి ప్రవేశిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.  ఇల్లు కొనాలని నిర్ణయించుకుంటారు. 

వృశ్చికం

(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
వ్యాపార రంగంలోని వారికి ఆదాయం తగ్గే సూచనలున్నాయి. స్నేహితులు తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది.  కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ప్రేమల్లో ఆచితూచి అడుగు వేయాలి. 
 
ధనుస్సు

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఏలిన్నాటి శని కారణంగా మధ్య మధ్య ఏదో ఒక అనారోగ్యం బాధిస్తుంటుంది. శనికి దీపం వెలిగించండి. ఉపశమనం లభిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది.బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. స్థాన చలనం సంభవం. పెళ్లి బాజాలకు ఇది సమయం. ప్రేవులకు కాస్తంత దూరంగా ఉండండి. 

మకరం

(ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2)
బదిలీకి, స్థాన చలనానికి అవకాశాలున్నాయి. తలచిన పనులు నెమ్మది మీద పూర్తవుతాయి. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగం మార్పు ప్రయుత్నాలు ఫలిస్తాయి. ప్రేమలు బెడిసికొట్ట వచ్చు. పెళ్లి సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంది. పై అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. 
 
కుంభం

(ధనిష్ఠ 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3)
ఉద్యోగంలో అనుకూల మార్పులు సంభవం. పెళ్లి బాజాలు మోగుతాయి. తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు. పిల్లలు ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రేమలు ఫలిస్తాయి. ఆదాయం బాగుంటుంది. మధ్య మధ్య ఆరోగ్యం సంగతి చూసుకోవాల్సి ఉంటుంది. 

మీనం

(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆదాయం తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. అతి కష్టం మీద పెళ్లి సంబంధాలు కుదురుతాయి. పిల్లల నుంచి మంచి వార్తలు వింటారు. దూర ప్రయాణాలకు, తీర్థయాత్రలకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. 

English Title
astrology




Related News