వ్యక్తులను అందలవెుక్కించడానికేనా..!

Updated By ManamWed, 10/17/2018 - 02:43
vote

నెహ్రూ లేని భారతదేశాన్ని ఉహించలేమని భయపడ్డారు కొందరు, ఇందిర తరువాత దేశం ఏమైపోతుందో అని వణికిపోయారు ఎందరో, నాటి గాంధీ హత్య మొదలు రాజీవ్ మరణం దాకా, శిలాన్యాసం మొదలు ముజఫర్ నగర్ అల్లర్ల దాకా అణువణువునా భయం మనల్ని వెంటాడింది, అయినా అవేవీ మన అస్తిత్వాన్ని దెబ్బతీయలేదు, కారణం ప్రపంచంలోనే అతిశక్తిమంత మైన ప్రజాస్వామ్యం మనది. వ్యక్తుల మీద, వ్యక్తిత్వాల మీద ఆధారపడింది కాదు, విలువల మీద, విశాలమైన ఆకాంక్షల మీద నిర్మాణమైన సంఘటిత వ్యవస్థ మనది. ఆయనే రావాలి... అన్నీ చేయాలి అని కాదు, మేము ఎన్నుకుంటాం... వాళ్ళు పాలిస్తారు అని ఆలోచించాలి.

voteగత దశాబ్దకాలంగా మన రాజకీయాల్లో కొత్త ఒరవడి మొదలైంది, మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణ యించాం, ముందే ప్రకటించే దమ్ము మీకుందా  అంటూ ఎదుటిపక్షాన్ని దెప్పిపొడవడం ఆనవాయితీ అయింది. నాయకులలో మొదలైన ఈ సవాలు కార్య కర్తలకు పాకింది, చివరకు ఓటువేసే ఓటర్లను అయోమ యానికి గురిచేసే సుడిగాలిలా మారింది. ఇంతకూ మన ఎన్నికల ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రిని, ప్రధా న మంత్రిని ఎన్నుకోవడమా లేక బలమైన మంత్రివర్గా నికి దారులు వేయడమా ? 
సర్వసత్తాక, గణతంత్ర భారతదేశంలో ప్రధాన మంత్రినైనా, ముఖ్యమంత్రినైనా నిర్ణయించాల్సింది ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు మాత్రమే. మూడిం ట ఒకవంతు ఎం.ఎల్.ఏలు, ఎం.పీలు గెలిచిన పార్టీని వీడితే దానికి చట్టబద్ధత ఇవ్వడం వెనుకగల ఉద్దేశం కూడా ఇదే. భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్ర ధానమంత్రికి, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అపరిమిత అధికారాలు, అమెరికా అధ్యక్షునిలా వీటో అధికారాలు ఇవ్వలేదు, అధికారాలన్నీ మంత్రివర్గాలకే బదలాయిం చారు భారతీయ రాజ్యాంగ నిర్మాతలు. ప్రభుత్వాల ఆలోచనలన్నీ కూడా మంత్రివర్గ నిర్ణయాల ద్వారానే రాజ్యాంగ సభల్లోకి ప్రవేశిస్తాయి, శాసనాలుగా రూపాం తరం చెందుతాయి. ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా మంత్రివర్గాన్ని ప్రభావితం చేయగలరే కాని ఏకపక్షంగా శాసించలేరు. మహానేత సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటల్లో చెప్పాలంటే మంత్రివర్గంలో అందరూ సమానులే. ప్రధానమంత్రి సమానుల్లో ప్రథముడు, ఇదేసూత్రం ముఖ్యమంత్రులకు కూడా వర్తిస్తుంది. భవి ష్యత్తులో నియంతృత్వపు నీడలు భారతదేశం మీద ప్రసరించకూడదనే ఉద్దేశంతో అంబేడ్కర్ లాంటి మహానుభావులు చేసిన ఏర్పాటది.

ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు శాసనసభలో ప్రతిధ్వనించాలంటే, వారి ఆకాంక్షలకు శాసనరూపం రావాలంటే ఒకరిద్దరి వల్ల అయ్యే పని ఎంతమాత్రం కాదు. సమస్యలను భిన్నకోణాల నుంచి ఆలోచించ గలిగి, వాటికి అక్షర రూపమిచ్చి గలమెత్త గలిగే నాయ కులు సమాజం నలుమూలల నుంచి రావాలి. అటు వంటి నాయకత్వపు సంఘర్షణ నుంచి సంఘటితంగా వచ్చే నిర్ణయాలు రేపటి ఉషోదయానికి మార్గదర్శకాలవుతాయి. వేయి ఆలోచనలు సంఘర్షించనీ, వంద పూలు వికసించనీ అన్నాడో మహానుభావుడు, అక్షరా ల అది నిజం. ప్రజాస్వామ్యం అనే వటవృక్షం పరిపు ష్టంగా వికసించాలంటే విభిన్న ఆలోచనలు నిర్భయం గా, నిస్వార్థంగా సంఘర్షించ గలగాలి. జవహర్‌లాల్ నెహ్రు, అంబేడ్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్యాం ప్రసాద్ ముఖర్జీ, రాజగోపాలాచారి, అటల్ బిహారీ వాజ్‌పాయ్, మురార్జీ దేశాయ్, పీ.వీ నరసింహారావు, బాబు జగ్జీవన్ రాం, జార్జ్ ఫెర్నాండెజ్, నితీష్ కుమార్, వి.వి గిరి, ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్ రెడ్డి, మమతా బెనర్జీ, యశ్వంత్ సింగ్ లాంటి హేమా హేమీ లున్న నాటి మంత్రివర్గాలకు, అధినేత నిర్ణయానికి గొర్రెల్లా తల ఊపుతూ తమ ఉనికినే మరచిపోతున్న నేటి మంత్రివర్గాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత  తేడా ఉన్నది. 

మంత్రివర్గ సమావేశాలంటే గతంలో ఘనమైన ప్రచారం ఉండేది. మంత్రివర్గ సమావేశాలు వాడిగా, వేడిగా జరిగాయంటూ వినేవాళ్ళం. పలానా మంత్రి ఈ ప్రతిపాదన చేశాడు, పలానా మంత్రి దీన్ని వ్యతి రేకించాడు, మరొకరు సమర్థించారు అంటూ, అధినేత సంధానకర్తగా వ్యవహరించాడంటూ విఫులమైన వివర ణలతో కూడిన వార్తలు చూసేవాళ్ళం. నాటి మంత్రి వర్గాలు వాళ్ళ వాళ్ళ హోదాలతో సహా ప్రజల నోళ్ళలో నానేవి. నేటి దుస్థితిని పరిశీలిస్తే ఏ శాఖకు ఎవరు మంత్రి అనే విషయం ఆయా మంత్రుల అనుచరులకు మినహా సామాన్యుని ఆలోచనల్లో ఉండటమే లేదు. ఏ మూల ఏ సమస్య వచ్చినా, ఏ శాఖలో ఏ దస్త్రం కదలాలన్నా, ఏ వాగ్దానం చేయాలన్నా ముందుండేది ము ఖ్యమంత్రి కాదంటే ఒకరిద్దరు మంత్రులు మాత్రమే. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే పెను నిర్ణయాలు, నోట్ల రద్దు లాంటి పెద్ద నిర్ణయాలు  కూడా చాయ్ తాగినంత సేపట్లో జరిగిపోతున్నాయంటే, అసలు మంత్రివర్గానికి ముందస్తు తెలియకుండా జరిగిపోతున్నాయంటే మన భవిష్యత్తు సురక్షితమేనా అనే సందేహం కలుగుతున్నది. గతంలో పలానా మంత్రి వాగ్దానం చేశాడు  అం టూ పేపర్లలో వార్తలు చదివే వాండ్లం. స్వతంత్రంగా శాఖలను నిర్వహించే దమ్ము, స్వతంత్రించి సమస్యల మీద వాగ్దానాలు చేయగల దైర్యం ఉన్న మంత్రులు దేశంలో మనకు అక్కడక్కడ మాత్రమే తారసపడు తున్నారు. పీ.వీ.నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పాయ్, మురార్జీ దేశాయ్, జగ్జీవన్ రాం, లాల్ బహ దూర్ శాస్త్రి, అంబేడ్కర్, లాంటి మహానుభావులు ఏ మంత్రివర్గాల్లో ఉన్నా ప్రధానమంత్రులతో సంబంధం లేకుండా తమ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించారు, ఆ మంత్రి వర్గానికే వన్నె తెచ్చారు. అటువంటి యోధులతో కూడి న మంత్రివర్గాల కోసం ప్రజలు తపించాలి. సమాజం లోని అవలక్షణాలను, అసంతృప్తిని గుర్తించగల, సమా జ అవసరాలను మంత్రివర్గం ముందుంచగల దక్షత గలిగిన నాయకులు నేడు మనకు కావాలి. ఒక్క ముఖ్య మంత్రో, ప్రధానమంత్రో దమ్మున్నోడైతే సరిపోదు, ఆ దమ్ముకు దన్నుగా నిలిచే, దారితప్పితే ఎదిరించే సమ ఉజ్జీలు కూడా కావాలి.

రాచరికంలో బలవంతుడే నాయకుడు, నియంతృ త్వంలో శత్రువులను తుదముట్టించిన వాడే పాలకు డు, కాని ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ఒక్కరి తోనో, ఇద్దరితోనో లాగించాలని చూస్తే అది వ్యక్తిస్వా మ్యానికి దారితీసే ప్రమాదమున్నది. నేటి చైనా, కొరి యా దేశాలే అందుకు ఉదాహరణ. కేవలం ఒకరిద్దరి మీద ఆధారపడితే జరిగే అనర్థాలు గతంలో కేంద్రం లో, రాష్ట్రంలో చూశాం, ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. నెహ్రూ లేని భారతదేశాన్ని ఉహించలేమని భయపడ్డా రు కొందరు, ఇందిర తరువాత దేశం ఏమైపోతుందో అని వణికిపోయారు ఎందరో, నాటి గాంధీ హత్య మొదలు రాజీవ్ మరణం దాకా, శిలాన్యాసం మొదలు ముజఫర్ నగర్ అల్లర్ల దాకా అణువణువునా భయం మనల్ని వెంటాడింది, అయినా అవేవీ మన అస్తిత్వాన్ని దెబ్బతీయలేదు, కారణం ప్రపంచంలోనే అతిశక్తిమంత మైన ప్రజాస్వామ్యం మనది. వ్యక్తుల మీద, వ్యక్తిత్వాల మీద ఆధారపడింది కాదు, విలువల మీద, విశాలమైన ఆకాంక్షల మీద నిర్మాణమైన సంఘటిత వ్యవస్థ మన ది. ఆయనే రావాలి... అన్నీ చేయాలి అని కాదు, మేము ఎన్నుకుంటాం... వాళ్ళు పాలిస్తారు అని ఆలోచించాలి. మన ఓటు ప్రధాన మంత్రికో, ముఖ్యమంత్రికో కాదు మనకు ప్రాతినిధ్యం వహించే ఎం.పీకి లేదా ఎం.ఎల్.ఏకు అన్న స్పృహను ఓటర్లు ప్రదర్శించిన రోజు బలమైన నాయకుణ్ణి కాదు బలమై న ప్రభుత్వాలను మనం చట్టసభల్లో చూస్తాం. 
చందుపట్ల రమణ కుమార్ రెడ్డి
న్యాయవాది
9440449392 

Tags
English Title
To be honest people!
Related News