రియల్ లైఫ్‌కు దగ్గైరెన పాత్రలో..!

Updated By ManamWed, 09/19/2018 - 19:43
Bhale Manchi Chowka Beram
bbb

అరోళ్ళ గ్రూప్ పతాకంపై అరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. మురళీకృష్ణ ముడిదాని దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్, కె.కె.రాధామోహన్ సమ‌ర్పిస్తున్నారు. నవీద్, పార్వతీశం, యామినీ భాస్కర్ తారాగణం. అక్టోబర్ 5న సినిమా విడుదలవుతుంది. గురువారం హీరోయిన్ యామినీ భాస్కర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన  ఇంటర్వ్యూలో యామినీ భాస్కర్ మాట్లాడుతూ ‘‘నాకు పాత్ర, కథ నచ్చితేనే సినిమా చేయడానికి అంగీకరిస్తాను. సినిమా అంతా నా పాత్ర ఉండి ప్రాముఖ్యత లేకపోతే గుర్తింపు రాదు కదా!. ఇక సినిమా విషయానికి వస్తే.. ‘భలే మంచి చౌకబేరమ్’ చిత్రంలో నా పాత్ర పేరు ఆదర్శి. ఎదుటివారు కష్టాల్లో ఉంటే తన దగ్గరున్నది కూడా ఇచ్చేసే మంచి మనసున్న అమ్మాయి పాత్ర నాది.

హీరో కూడా నా మంచి మనసుని మోసం చేస్తాడు. రియల్ లైఫ్‌లో కూడా నేను అంతే ఎదుటివారు కష్టాల్లో ఉంటే నా వల్లనైనా సాయం అందిస్తాను. మా టీమ్‌లో అందరం సినిమా బాగా రావడానికి ఎంతో కష్టపడ్డాం. సినిమా బాగా వచ్చింది. కాబట్టి టీమ్ అంతా చాలా నమ్మకంగా ఉన్నాం. కన్‌ఫ్యూజన్ కామెడీతో సినిమా అంతా సాగుతుంది. నవీద్ స్నేహితుడి పాత్రలో పార్వతీశం నటించారు. మాతో పాటు రాజా రవీంద్రగారి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది.  ప్రస్తుతం స్క్రిప్ట్స్ వింటున్నాను. తమిళంలో ఇది వరకు ఓ సినిమాలో నటించాను. అవకాశాలు వస్తే.. తమిళంలో కూడా నటిస్తాను’’ అన్నారు. 

English Title
Bhale Manchi Chowka Beram release date fix
Related News