గంగూలీ స్టైల్‌లో చొక్కా విప్పేసిన బీజేపీ అభ్యర్థి..

Updated By ManamMon, 09/03/2018 - 17:07
BJP man, Karnataka local body poll, Sourav Ganguly style

BJP man, Karnataka local body poll, Sourav Ganguly styleబాగల్‌ కోట: ఎన్నికల్లో గెలిస్తే ఎంత కిక్కు ఉంటుందో కర్ణాటక‌కు చెందిన వీరప్ప సిరగన్నావర్‌ను అడిగేతే చెబుతాడు. కర్ణాటక మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో ఒంటిపై చొక్కా విప్పేసి నడిరోడ్డుపై ఇలా తిరుగుతూ కనిపించాడు. 2002లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన న్యాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సారథ్యంలో భారత్ విజయం సాధించింది. ఈ సందర్భంగా గంగూలీ ఇదే తరహాలో చొక్కా విప్పేసి మైదానమంతా తిరుగుతూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

అలాగే కర్ణాటకలోని బాగల్‌కోటలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వార్డ్ నెం.19పై పోటీచేసిన బీజేపీ అభ్యర్థి సిరగన్నావర్‌ కూడా గంగూలీ స్టైల్లో చొక్కా విప్పి పోలీసు బారిగేడ్ వరకు నడుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. బీజేపీ అభ్యర్థి వీరప్ప విజయోత్సాహంతో వెళ్తుంటే వెనుక నలుగురు కెమెరామెన్లు తమ కెమెరాలతో క్లిక్‌మనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో.. 

English Title
BJP man celebrates Karnataka local body poll win Sourav Ganguly-style
Related News