బ్రహ్మోత్సవం

Updated By ManamThu, 09/20/2018 - 00:21
thirumala

గరుడ సేవ 
తిరుమలలో శ్రీవారి గరుడ సేవలకు ప్రత్యేకత ఉంది. అ రోజున గరుడ పక్షి కూడా తిరుమలలో విహరిస్తుంది.  దీని కోసం స్థానికులతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు. గరుడ వాహన సేవ కు 2 లక్షల మందికి పైగా భక్తులు రాగా వీరిలో తమిళనాడు నుంచి వచ్చే భక్తుల్లో ఎక్కువ శాతం నడిచి వచ్చారు. ఇందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి అలంకరించుకున్న మాలలు,  చెన్నై నుంచి అలంకృతమైన గొడుగులు కూడా స్వామి వారి కోసం ప్రత్యేకంగా వస్తాయి. ఆ తరువాతి రోజుమలయప్పస్వామి శ్రీరాముడి భక్తుడైన హనుమంత వాహనంలో, అదే రోజు సాయంత్రం స్వర్ణరథంపై.. రాత్రి గజ వాహనంపై ఊరేగారు. మరుసటి రోజు సూర్య ప్రభ, చంద్ర ప్రభ వాహనాలపై స్వామి ఊరేగారు. 
 

image


ఆధ్యాత్మిక ఆకర్షణలు
బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా 4 గజ రాజులు, 4 అశ్వాలు, 4 వృషభాలను వాహన సేవలకు వినియోగించారు. వాహన సేవల్లో స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేసేలా దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టులతో పాటు అళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, ఎస్వీ సంగీత కళాశాలలు కనుల విందుగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. భరతనాట్యం, గాత్ర, సంగీత కచేరీలు, ధార్మిక ఉపన్యాసాల ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మికత నింపారు.  అక్టోబరు 10 నుంచి 18వ తేదీ వరకు తిరుమల గిరులు మరోమారు బ్రహ్మోత్సవ శోభను సంతరించుకోనున్నాయి.
 

English Title
Brahmotsavam
Related News