యాదాద్రీశుని బ్రహ్మోత్సవం

Updated By ManamTue, 02/20/2018 - 02:25
yadadri temple

yadadri templeప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో యాదాద్రి బ్రహ్మోత్సవ, వార్షిక కల్యాణోత్సవాలు జరుగుతాయి. గత శనివారం ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కాగా వచ్చే శనివారం నాడు యాదాద్రీశునికి కల్యాణం, మరునాడు రథోత్సవం జరుగనున్నాయి. వచ్చే మంగళవారం నాడు నిర్వహించే చక్రస్నానం, శతఘటాభిషేకాలలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు.

యాదాద్రి నృసింహుడు జగద్రక్షకడు. శ్రీరాముని బావగారైన రుష్యశృంగ మహర్షిపుత్రుడే యాదమహర్షి. ఆయన తపస్సు ఫలితంగా యాదాద్రి ఏర్పడింది. యాదర్షి పేరుమీదుగా యాదగిరి, యాదాద్రి అని పిలుస్తారు. యాదర్షి కోరిక మేరకు నృసింహస్వామి ఇక్కడజ్వాలానరసింహ, ఉగ్రనరసింహ, లక్ష్మీనరసింహస్వామి, గండభేరుండనరసింహ రూపాలతో వెలిశాడు. పంచనృసింహులు ఒకే క్షేత్రంలో ఉండడం వల్ల యాదాద్రి పంచనృసింహ క్షేత్రమని పిలుస్తారు. స్కాంద, బ్రహ్మాండ పురాణాల ప్రకారం యాదాద్రికృతయుగం నాటి పరమ పవిత్ర క్షేత్రం. 

పంచనారసింహ క్షేత్రం
సర్వాంతర్యామి అయిన శ్రీమహా విష్ణువ ప్రహ్లాదుని కోరిyadadri templeక మేరకు స్తంభంలో ఉదయించి నారసింహనిగా విచ్చేశాడు. ప్రహ్లాదుని కోరిక మేరకు అనేక ప్రాంతాల్లో ఆయన వెలిశాడు. యాదాద్రిలోని గుహలో కృతయుగం నుంచి ఉండే వాడని చెబుతారు. ఆనాడు బ్రహ్మాది దేవతలు ఈ నృసింహస్వామిని ఆకాశగంగతో అభిషేకంచేశారు. ఆయన పవిత్ర పాద తీర్థమే విష్ణుకుండమై దివ్యధారగా యాదాద్రిలో నేటికీ భక్తులను పునీతులను చేస్తోంది.

యాదమహర్షి తపస్సు చేసుకునే కాలంలో ఒక సారి భయంకర ఆకృతిగల రాక్షసుడొకడు మహర్షిని కబళించడానికి రావడంతో భక్తరక్షణార్థం భగవానుడు శ్రీచక్రరాజాన్ని ప్రయోగిం చాడు. అది దివ్యమైన అగ్నిజ్వాలలతో మండి పడుతూ ఆరాక్షసుని శిరస్సును తెంచివేసింది. యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయగోపురం పైష ట్కోణ ఆకారంలో ఆవిర్భ వించాడు. యాదా ద్రి శిఖరంపై స్వామి సుదర్శ నాన్ని దర్శించుకు న్నంత మాత్రంలో రోగాలు తగ్గిపోతా యని భక్తులు విశ్వసిస్తారు. యుగ యుగాలుగా ఆరాధన లం దుకుంటున్న యాదగిరీశుని సరికొత్త ఆలయం అతి త్వరలో రూపొందబోతోంది.
అంగరంగ వైభవం

yadadri templeయాదాద్రిలోన వాహ్నిక దీక్షతో 11రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిసంవత్సరం ఫాల్గు ణశుద్ధవిదియ నుంచి ద్వాదశివరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలను అంకురారోపణతో మొదలయ్యాయి. ధ్వజారోహణం నుంచి శృంగారడోలోత్సవం వరకూ వివిధ కార్యక్రమా లు ఈ పదకొండు రోజుల్లో చోటుచేసుకుం టాయి. ఈ శుక్రవారంనాడు ఎదుర్కోలు మహోత్సవం, శనివారం తిరుకల్యాణ మహోత్సవం, వచ్చే ఆదివారం దివ్య విమాన రథోత్సవం ఉంటాయి. ప్రతిరోజూ వాహన సేవలుంటాయి. ఆలయనిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, స్వామి కల్యాణాన్ని భక్తులందరూ చూసి తరించేందుకు వీలుగా దేవస్థానం అన్ని ఏర్పాట్లుచేస్తోంది.

English Title
Brahmotsavam of yadadri narasimha swamy
Related News