54కి చేరిన మృతులు: బస్సు డ్రైవర్ మృతి

Updated By ManamTue, 09/11/2018 - 19:34
Bus Driver, Kondagattu Bus, Driver Srinivas 
  • కొండగట్టు బస్సు బోల్తా పడ్డ ఘటన.. 

  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృత్యువాత

Bus Driver, Kondagattu Bus, Driver Srinivas జగిత్యాల: కొండగట్టు ఘాట్ రోడ్ వద్ద జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో మృతిచెందినవారి సంఖ్య 54కు చేరింది. బస్సు బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆగస్టు 15న ఉత్తమ ఆర్టీసీ అవార్డును శ్రీనివాస్ అందుకున్నాడు. బస్సుప్రమాదంలో మృతిచెందినవారిలో 32 మంది మహిళలు, 15మంది పురుషులు, నలుగురు చిన్నారులు ఉన్నారు.

ప్రమాదంలో గాయపడ్డ మరో 37 మందికి కరీంనగర్, హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 80మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 30 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం సంబంధిత బంధువులకు అప్పగించినట్టు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

English Title
Bus Driver dies in hospital after Bus accident
Related News