నదిలో బొమ్మలా కొట్టుకుపోయిన బస్సు!

Updated By ManamMon, 09/24/2018 - 22:20
Tourist bus
  • హిమాచల్, పంజాబ్, కశ్మీర్‌లో భారీ వర్షాలు

  • కేరళలోనూ రెండు రోజుల్లో కుంభవృష్టి

  • వాతావరణ శాఖ హెచ్చరిక.. ఎల్లో అలర్ట్ జారీ 

A bus washed down in the river!షిమ్లా/ చండీగఢ్: ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రావి, బియాస్ నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. దాంతో రెండు నదులు పరివాహక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో ఓ టూరిస్టు బస్సు నదిలో కొట్టుకుపోయింది. బియాస్ నది ఒడ్డున నిలిపిఉన్న ఓ టూరిస్టు బస్సు.. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో నదిలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కొన్ని మీటర్ల వరకూ నదిలో బస్సు..పిల్లలు ఆడుకునే బొమ్మలా  నీటిలో తేలుతూ కొట్టుకుపోవడం గమనార్హం. కొద్ది దూరం వెళ్లిన తర్వాత అది నీటిలో పూర్తిగా మునిగిపోయి కనిపంచకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మనాలీ-లేహ్ మార్గంలో భారీగా మంచుకురుస్తుండటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పంజాబ్‌లోనూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థమైంది. రావి నది పొంగి ప్రవహిస్తుండటంతో  బస్సులు, లారీలు, కార్లు వరదల్లో చిక్కుకొని ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కాగా, మొన్నటి వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పథానంతిట్ట, ఇడుక్కి, వాయానంద్ జిల్లాల్లో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరక ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

English Title
A bus washed down in the river!
Related News