రైతులకు కేంద్రం శుభవార్త...

Updated By ManamWed, 09/12/2018 - 18:43
ethanol
  • ఇక నుంచి కొత్త ధాన్య సేకరణ విధానం

  • ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

farmers

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. ఇటీవల ప్రతిపాదించిన కొత్త ధాన్య సేకరణ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. బుధవారం సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఇథనాల్ ధరలను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త ధాన్య సేకరణ విధానం అమలులోకి వస్తే.. రైతులకు తప్పనిసరిగా మద్దతు రానుంది.

ఎందుకంటే.. కొత్త విధానం ప్రకారం.. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా తక్కువకు మార్కెట్ ధరలు తగ్గిన పక్షంలో కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఫలితంగా దళారులు తమ ఇష్టారాజ్యంగా పంట ఉత్పత్తులకు ధరలను నిర్ణయించి రైతులను నిలువు దోపిడీ చేసేవారు. కొత్త విధానంతో అలాంటి సమస్యలన్నింటికీ చెక్ పడనుంది.

కొంతమంది అధికారులు, పాలకుల స్వార్థంతో దళారులకు కొమ్ముకాస్తూ.. మార్కెట్‌ను శాసించేవారు. కృతిమంగా పంట ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం, తగ్గించడం చేయడంతో రైతులకు న్యాయం జరిగేది కాదు. కానీ కొత్త విధానం వల్ల మార్కెట్‌లో మద్దతు ధర కంటే పంట ఉత్పత్తులకు తక్కువ ధర వస్తే.. ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించేలా హామీ ఉండడంతో ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంది. 

తదనుగుణంగా తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్‌లోని ధరలపై ప్రభుత్వం ఆజమాయిషీ తీసుకుని.. రైతులకు మద్దతు ధర కల్పిస్తుంది. ఇదిలావుంటే.. 22 పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు ఇటీవల ఈ పంటల ఉత్పత్తులకు మద్దతు ధరను పెంచారు. కొత్త ధాన్య సేకరణ విధానం వల్ల కేంద్రంపై రూ.40వేల కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్రం అంచనా వేసింది. అలాగే లీటర్ ఇథనాల్‌కు ఇప్పుడు వస్తున్న రూ.47.5లను ఏకంగా రూ.52కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

English Title
Cabinet approves 25 percent hike in ethanol prices
Related News