ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలకు రెక్కలు

Updated By ManamWed, 03/21/2018 - 16:00
representational

representationalన్యూఢిల్లీ: కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే కొనేదేదో ఏప్రిల్ 1 లోపే కొనేయండి. లేదంటే కార్లు మరింత భారం అవుతాయి. ఇప్పటికే టాటా మోటార్స్, నిస్సాన్ ఇండియా సంస్థలు కార్ల మోడళ్లపై ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలే అమలవుతాయని ప్రకటించింది. ప్రయాణ వాహనాలపై (పీవీ) ఏప్రిల్ 1 నుంచి రూ.60 వేల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ‘‘పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పలు బాహ్య ఆర్థిక పరిస్థితుల వల్లే కార్ల ధరలను పెంచాల్సి వస్తోంది’’ అని టాటా మోటార్స్ పాసింజర్స్ వెహికిల్ బిజినెస్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ చెప్పారు. అయినా కూడా కంపెనీ వృద్ధి బాగానే ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టియాగో, హెక్సా, టిగోర్, నెగ్జాన్ వంటి అధునాతన డిజైన్లు టాటా వృద్ధికి దోహదం చేస్తాయని చెప్పారు. ఇక, నిస్సాన్ సంస్థ కూడా డాట్సన్ సహా అన్ని కార్ల ధరలను 2 శాతం మేర పెంచుతామని ప్రకటించింది. పెరుగుతున్న వ్యయ నిర్వహణ వల్లే కార్ల ధరలను పెంచుతున్నామని, అయినా కూడా వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తామని నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జిరోమ్ సైగట్ తెలిపారు.

ఇటు లగ్జరీ కార్ల బ్రాండ్ అయిన ఆడి కూడా ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. తమ కార్ల మోడళ్లపై రూ.లక్ష నుంచి రూ.9 లక్షల దాకా ధరను పెంచుతున్నామని చెప్పింది. కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీని పెంచిన నేపథ్యంలోనే ధరలను పెంచుతున్నామని, పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచే అమలవుతాయని ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ వెల్లడించారు. ఎడ్యుకేషన్ సెస్ పేరిట సాంఘిక సంక్షేమ సర్‌చార్జ్‌నూ వసూలు చేస్తున్న నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. 

English Title
Cars price will hike from april 1
Related News