మహిళపై ప్రముఖ బాక్సర్ దాడి.. కేసు నమోదు

Updated By ManamThu, 06/14/2018 - 15:23
jai

jai చండీగఢ్: ప్రముఖ బాక్సింగ్‌ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహిత జై భగవాన్‌పై హరియాణా పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళా ఉద్యోగిపై దాడి చేశారని ఆయనపై కేసు నమోదైంది. అయితే ఒలంపిక్‌ విజేత అయిన జై భగవాన్‌ ప్రస్తుతం ఫతేహాబాద్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ​కుటుంబ సభ్యులకు హిసార్‌లోలో ఓ మద్యం షాపు ఉంది. 

నిబంధనలకు విరుద్దంగా అక్కడ మద్యం అమ్ముతున్నారని ఆరోపణలు రావడంతో గత నెల 19న రాత్రి 9 గంటలకు హీసార్‌ అనే మహిళా ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ అక్కడకు వెళ్లి షాపు షాపు డాక్యుమెంట్లను చూపించాలని కోరారు. అదే సమయంలో అక్కడే ఉన్న జై భగవాన్‌ ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె పై అధికారులకు చెప్పగా.. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా హిసార్‌ డిప్యూటీ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషనర్‌(డీఈటీసీ) ని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల జూన్‌12 న భగవాన్‌పై కేసు నమోదు చేశారు.

English Title
Case against boxer Jai Bhagwan
Related News