అంబరాన్ని అంటిన ఎల్జీబీటీల సంబరాలు

Updated By ManamThu, 09/06/2018 - 13:40
Celebrations in Chennai after Supreme Court in a unanimous decision
Love, Equally: Supreme Court Ends Section 377

న్యూఢిల్లీ : స్వలింగ సంప్కరం నేరం కాదంటూసుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ఎల్జీబీటీల ఆనందం అంబరాన్ని అంటాయి. సెక్షన్ 377పై...ఇతరుల హక్కులను తగ్గించడం సామాజిక నైతికత కాదని, స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించడం అహేతుకం ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడిన విషయం తెలిసిందే. తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా ఎల్జీబీటీలు సంతోషంతో స్వీట్లు పంచుకున్నారు. మరికొందరు డాన్సులు చేయగా,  బెలూన్స్ ఎగురవేసి ఆనందం వ్యక్తం చేసుకున్నారు. 

Love, Equally: Supreme Court Ends Section 377

మరోవైపు సుప్రీం తీర్పుకు మద్దతుగా పలువురు ప్రముఖులు ట్వీట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ కరణ్ జోహార్... ‘ ఇది చరిత్రాత్మకమైన తీర్పు.. చాలా గర్వంగా ఉంది. దేశానికి మళ్లీ ఆక్సిజన్ అందడం ప్రారంభమైంది’ అని ట్విట్ చేశారు. అలాగే ప్రముఖ రచయిత చేతన్ భగత్, కేంద్ర మాజీమంత్రి శశిధరూర్‌, నటుడు ఆయుష్మాన్ ఖురానా తదితరులు సుప్రీం తీర్పున స్వాగతించారు.

English Title
Celebrations in countrywide after Supreme Court legalises homosexuality
Related News