ఆదిలోనే సన్‌రైజర్స్‌కు షాక్..!

Updated By ManamSun, 05/27/2018 - 19:40
Chennai Super Kings vs Sunrisers Hyderabad, IPL 2018 Final

Chennai Super Kings vs Sunrisers Hyderabad, IPL 2018 Final
ముంబయి: వాంఖడే వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మధ్య ఐపీఎల్‌-11 ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ముందుగా టాస్‌ గెలిచిన చెన్నై సారథి మహేంద్రసింగ్‌ ధోనీ.. సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాదాపు రెండు నెలల పాటు అభిమానులను అలరించిన ఐపీఎల్ టోర్నీ రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. కాగా.. సీనియర్ బౌలర్ హర్భజన్‌సింగ్‌కు సడన్ షాకిచ్చిన ధోనీ.. ఆయన స్థానంలో కర్ణ్‌శర్మను తీసుకున్నట్లు ప్రకటించాడు. ఈ సీజన్‌లో భజ్జీ ఘోరంగా విఫలమవ్వడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత మ్యాచ్‌లో నిలకడగా రాణించిన సన్‌రైజర్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా తుదిపోరు నుంచి తప్పుకున్నాడు. సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడి తేలిపోయిన ఖలీల్ అహ్మద్ స్థానంలో సందీప్ శర్మ, శ్రీవాత్స్ గోస్వామి జట్టులోకి వచ్చినట్లు సన్‌రైజర్స్ సారథి కేన్ విలియమ్సన్ చెప్పాడు.

సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ ధావన్‌, శ్రీవాత్స్‌ గోస్వామి ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే తొలి ఓవర్లు ఆరు పరుగులతో సరిపెట్టుకున్నారు. అనవసర పరుగు కోసం యత్నించి గోస్వామి 13పరుగుల వద్ద రనౌటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన కేన్ విలియమ్స్ 2సిక్స్‌లు, 2ఫోర్లతో బ్యాటింగ్ సాగిస్తున్నాడు. ప్రస్తుతం శిఖర్ థావన్ 25, కేన్ విలియమ్స్28 పరుగులతో క్రీజులో ఉన్నారు.  మొత్తం స్కోర్ 62/1 పరుగులు. 8 ఓవర్లు పూర్తయ్యాయి.

64 పరుగుల వద్ద సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శిఖర్‌ ధావన్‌ 26(25) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ధావన్ తర్వాత షకీబుల్‌ హసన్ బ్యాటింగ్ దిగాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. మొత్తానికి చూస్తే ధోనీ సేన.. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌లను మొదట్నుంచే కట్టడి చేస్తూ వస్తోంది. ధావన్ ఔటవ్వడంతో సగం మ్యాచ్ అయిపోయినట్లేనని క్రీడాభిమానులు చెప్పుకుంటున్నారు.

English Title
Chennai Super Kings vs Sunrisers Hyderabad, IPL 2018 Final
Related News