రిజర్వేషన్ల కోసం 17ఏళ్ల బాలిక ప్రాణత్యాగం.. 

Updated By ManamTue, 09/11/2018 - 15:36
Class 11 girl, suicide, reservation, Maratha community
  • మరాఠి రిజర్వేషన్ల కోసం ఇంటర్ విద్యార్థిని ప్రాణత్యాగం..

  • హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణం.. సూసైడ్ నోట్‌ లభ్యం.. 

Class 11 girl, suicide, reservation, Maratha communityముంబై: మరాఠా రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ 17ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అహ్మద్ నగర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. రాధాభాయ్ కాలే ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న కిషోరి బాబన్ కకడే హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టు ఎస్పీ రంజన్ కుమార్ శర్మ తెలిపారు. ఘటనా స్థలంలో కిషోరి పక్కన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరాఠా కమ్యూనిటీల రిజర్వేషన్ల కోసం త్యాగం చేసుకుంటున్నట్టుగా సూసైడ్ నోట్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలో 89 శాతం మార్కులతో పాసైయ్యానని, కానీ, సైన్స్‌ విభాగంలో సీటు రాలేదని నోట్‌లో పేర్కొన్నట్టు ఎస్పీ శర్మ తెలిపారు. బాలిక కిషోరి తండ్రి పేదరైతు. కుమార్తె కాలేజీ అడ్మిషన్ కోసం నాన్ డివిజన్ కింద రూ.8వేలు చెల్లించాడు. తనకంటే 76 శాతం తక్కువ మార్కులు సాధించిన బాలికలకు రూ.1000తో రిజర్వడ్ కేటగిరీ కింద అడ్మిషన్ ఇచ్చారని వాపోయింది. మరాఠి కావడం కారణంగా తాను వివక్షకు గురైనట్టు కిషోరి ఆరోపించింది. తన ప్రాణత్యాగంతోనైనా మరాఠి కమ్యూనిటీలకు రిజర్వేషన్ల ఉద్యమానికి చేయూతనిస్తుందని ఆశిస్తున్నట్టు నోట్‌లో పేర్కొంది.  

English Title
Class 11 girl commits suicide demanding reservation for Maratha community
Related News