జెండర్ వివక్షపై ధిక్కార ఝంకారం

Updated By ManamTue, 09/11/2018 - 01:29
gender descrimination

imageఛత్తీస్‌గఢ్‌లోని రాయిపూర్‌లో గల హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థినులు చేస్తున ఆందోళన రెండోవారంలోకి ప్రవేశించిన అధికారులు పట్టించుకోవడం లేదు. వైస్ చాన్సలర్ నియామకం చెల్లదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గత నెల (ఆగస్టు) 27న తీర్పు వెలువరించడంతో తమ డిమాండ్లు, హక్కుల సాధనకు విద్యార్థినులు ఆందోళనకు దిగారు. చేతుల్లో ఫ్లాష్‌ైలెట్లు, నల్లజెండాలు ధరించి మెయిన్ గేటుకు పెద్దసంఖ్యలో విద్యార్థునులు చేరుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో హెచ్‌ఎన్‌ఎల్‌యూకు చెందిన స్టూడెంట్స్ బార్ అసోసియేుషన్ కూడా పాలుపంచుకుంది. వారి హక్కులపై యూనివర్సిటీ ప్రతినిధులు దాదాపు 20 నిమిషాలు విద్యార్థినులతో చర్చలు జరిపారు. పురుషులకు లేని కాంపస్ సమయాలు మహిళలకు మాత్రమే అమలుచేయడాన్ని ఉపసంహరించు కోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు తెల్లవారుజామున మూడు గంటల వరకు యూనివర్సిటీ ప్రాంగణంలో సంచరించడాన్ని అనుమతించి విద్యార్థుల విషయంలో పదిన్నర గంటల తరువాత ప్రాంగణంలో కనిపించరాదని ఆంక్షలు విధించడాన్ని విద్యార్థినులు ఆక్షేపిస్తున్నారు. 

హాస్టల్ వార్డెన్ డాక్టర్ బల్వీందర్ కౌర్‌ను తొలగించాలన్నది వారి ప్రధాన డిమాండ్. లింగవివక్షపై విశ్వవిద్యాలయం విద్యార్థినులు ఆందోళనకు దిగడం ఇదే మొదటిసారి కాదు. గతయేుడాది ఈ అంశంపై ఫేస్‌బుక్‌లో పేజీని కొంతమంది విద్యార్థినులు ప్రారంభించారు. తమ తరపున నిలవాల్సిందిగా కోరుతూ ఆ పేజీలో కథలు, కవితల రూపంలో పోస్టింగ్ చేసేవారు. దీంతో డాక్టర్ ఆయం హజ్రా అనే వ్యక్తి విద్యార్థినులను బెదిరించడం ప్రారంభించాడు. అతనిపై చర్యలు తీసుకోవడం పోయి విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించి వారికి చాడీలు చెప్పడం వార్డెన్ పనిగా పెట్టుకుంది. విద్యార్థినులు వేసుకునే దుస్తులు కూడా ఆమె దృష్టిలో తప్పుగానే కనిపించేవి. ఆమెకు నచ్చని దుస్తులు వేసుకున్నా,హాస్టల్‌కు ఐదునిమిషాలు ఆలస్యంగా వచ్చినా అదో పెద్దనేరైవెునట్లు వారికి నోటీసులు జారీచేసేది. విద్యార్థినులు జీన్స్, చొక్కాలు ధరిస్తే ఆవెు దృష్టిలో నేరమే. తమతమ గదుల్లోని సీసాల్లో నీళ్లు మెరుస్తుంటే అందులోఏదో నిషిద్ధ పదార్థాలు కలుపుకుంటున్నారంటూ వేధింపులు, జరిమానాలు విధించడం ఆవెుకు పరిపాటిగా మారింది.

కక్షసాధింపుతోను, లింగ వివక్షతోను వ్యవహరిస్తున్న వార్డెన్‌పై విద్యార్థినులు మండిపడుతున్నారు.వారి ఆందోళన రెండోవారంలోకి ప్రవేశించినా అధికారులకు చీమకుట్టినట్లు లేకపోవడం విచారకరం.

- సౌమ్యా రైజడా

English Title
Defamation of gender discrimination
Related News