ధర్మ సందేహం

Updated By ManamTue, 02/20/2018 - 02:10
fruits

పదహారు ఫలాల నోములో ఏఏ పళ్లను వాయినం ఇవ్వాలి?  

fruitsఅరటి పండు తప్ప మిగిలిన పళ్లన్నీ పదహారు ఫలాల నోములో ఇవ్వవచ్చు. దేవుడికి నివేదన చేసే ఇతర పళ్లన్నీ పనికి వస్తాయి. యాపిల్, రేగు పళ్లు పనికిరావు. పురుగులు పట్టడానికి ఎక్కువ అవకాశం ఉన్నపళ్లు ఇవ్వకపోవడం మంచిది. సీడ్ లెస్ అంటే గింజ లేని పళ్లు పనికి రావు. గింజ వంశాభివృద్ధికి దోహదం చేస్తుందని మనవారి నమ్మిక. అందుకే నోముల్లో గింజలేని పండు ఇవ్వకూడదన్నారు. సీతాఫలం, సపోటా, పుచ్చకాయ వంటివి నల్లని గింజలతో ఉంటాయి కనుక వాటిని సాధారణంగా ఇవ్వరు. కొబ్బరి, మామిడి, నారింజ, దోస, ద్రాక్ష, దబ్బ, నిమ్మ, రామాఫలం, పనస, పంపర పనస, దానిమ్మ, మాదీఫలం, జామ, వెలగ, ఖర్జూరం, గుమ్మడి వంటివి పదహారు ఫలాల నోములో వినియోగించ వచ్చు. పండు ఏదైనా చక్కనిది కావాలి. పచ్చిది, పుచ్చిపోయినది, కుళ్లినది, దెబ్బతిన్నది, సరైన ఆకారం లేక కుక్క మూతి పిందెలాగా ఉన్నది ఉపయోగించ కూడదు అని పదహారు ఫలాల నోము కథ చెబుతోంది.                        
- డా. కాకునూరి సూర్యనారాయణమూర్తి

English Title
Dharma doubt
Related News