శ్రీలంకలో  ఎన్‌టార్క్

Updated By ManamWed, 09/12/2018 - 22:33
Scooter

Entarkన్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ టివిఎస్  దాని స్కూటర్ మోడల్ ఎన్‌టార్క్125ని శ్రీలంకలో బుధవారం ఆవిష్కరించింది. టివిఎస్ మోటార్ కంపెనీ చైన్నై కేంద్రంగా పని చేస్తుంది. ఆ బైక్ డ్రమ్ (శ్రీలంక రూపాయల్లో  2,54,900), డిస్క్ (2,65,900) వెర్షన్‌లలో లభించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ‘‘టివిఎస్ ఎన్‌టార్క్125ని ఆకర్షణీయమైన, ఉన్నతమై ఫీచర్‌లతో తీర్చిదిద్దాం. ముఖ్యంగా స్కూటర్లను కొనుగోలు చేసే యువతను ఉద్దేశించి దీన్ని తీసుకొచ్చాం ’’ అని టివిఎస్ అంతర్జాతీయ వ్యాపారాల విభాగ సీనియర్ అధ్యక్షుడు ఆర్. దిలీప్ అన్నారు. టివిస్ స్మార్ట్‌ఎక్సోనెట్, టివిఎస్ ప్రత్యేక ఎన్‌టార్క్ మొబైల్‌యాప్ ద్వారా పనిచేసే  బ్లూటూత్ సాంకేతికతను ఈ స్కూటర్‌లో పొందుపర్చారు. ‘‘శ్రీలంకలో స్కూటర్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. అందులోనూ యువత వాటిపట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. సరికొత్త 125 సీసీ స్కూటర్ కొత్త స్టైల్, స్మార్ట్ టెక్నాలజీ, ఉత్తమ పనితీరుతో యువ వినియోగదార్లని ఆకర్షిస్తోంది ’’ అని టివిఎస్ శ్రీలంక ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రవి లియనగే అన్నారు.

English Title
Encort in Sri Lanka
Related News