ఎగుమతుల్లో 19 శాతం వృద్ధి

Updated By ManamWed, 09/12/2018 - 22:33
exports

exportsన్యూఢిల్లీ: పెట్రోలియం వంటి రంగాల ఆరోగ్యకరమైన పనితీరు వల్ల భారతదేశపు ఎగుమతులు ఆగస్టులో 19.21 శాతం వృద్ధి చెంది 27.84 బిలియన్ డాలర్లకు చేరాయి. ‘‘ఎగుమతి వాణిజ్యం 19.21 శాతం సానుకూల వృద్ధితో  2018 ఆగస్టులో 27.84 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పెట్రోలియం మినహా, మిగిలినవాటి ఎగుమతులు కూడా 17.43 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేశాయి’’ అని వాణిజ్య, పరిశ్రమల మంత్రి సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు. వస్తువుల దిగుమతులు కూడా 25.41 శాతం పెరిగి ఆగస్టులో 45.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ముడి చమురు ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఫలితంగా, దేశానికి 17.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడింది. వాణిజ్య లోటు జూలైలో  ఐదేళ్ళ అత్యధిక స్థాయి 18.02 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టులో  ఎగుమతులు 16.13 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో దిగుమతులు 17.34 శాతం వృద్ధి చెందాయి.

Tags
English Title
Exports up 19%
Related News