ఫేస్‌బుక్ నుంచి ఆ యాప్ ఔట్

Updated By ManamThu, 08/23/2018 - 13:09
Facebook

Facebookలీకుల ఆరోపణలు వచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ తాజాగా తమ ఫ్లాట్‌ఫాం నుంచి మరో థర్డ్ పార్టీ యాప్‌ను నిషేధించింది. మై పర్సనాలిటీ పేరుతో ఉన్న ఈ యాప్‌ వలన దాదాపు 40లక్షల మంది యూజర్ల పర్సనల్ డేటా తప్పుదారి పట్టే ప్రమాదం ఉందని తెలిపిన ఫేస్‌బుక్, దానిని తొలగిస్తున్నట్లు గురువారం వెల్లడించింది. 2012 నుంచి ఈ యాప్ ఫేస్‌బుక్‌లో ఉన్నట్లు ఆ సంస్థలోని ఓ అధికారి తెలిపారు.

మై పర్సనాలిటీ యాప్ వలన యూజర్ల సమాచారాన్ని ఇతర కంపెనీలతో పంచుకున్నట్లు విచారణలో తేలింది. దీనికి సంబంధించిన ఆయా యూజర్లకు సమాచారాన్ని తెలియజేశాం. ఈ యూజర్ల ఫ్రెండ్స్ సమాచారాన్ని కూడా దుర్వినియోగం చేశారా లేదా అన్న విషయంపై ఇంకా తెలియరాలేదు. వారిది కూడా దుర్వినియోగం అయిందని తెలిస్తే వెంటనే సమాచారం ఇస్తాం అంటూ ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అయితే కేంబ్రిడ్జ్ అనలిటికా స్కా తరువాత అనుమానాస్పదంగా ఉన్న సుమారు 400 యాప్స్‌ను ఫేస్‌బుక్ తొలగించిన విషయం తెలిసిందే.

English Title
Facebook banned another App
Related News