వివో ఎక్స్21.. ఆ ఒక్క ఫీచర్ అదుర్స్

Updated By ManamSun, 05/27/2018 - 16:29
With That Feature Vivo X21 Highlighted
With That Feature Vivo X21 Highlighted

స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలో వివో సంచలనమే సృష్టించింది అని చెప్పాలి. ప్రస్తుతం భారత మార్కెట్లలోని చైనా ఫోన్లలో రెడ్‌మి, వివోలదే హవా. ప్రీమియం మొబైళ్లలో ఉండే ఫీచర్లను ఆయా సంస్థలు తమ ఫోన్లలో పెడుతూ వాటి కన్నా తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తున్నాయి. అందులో వివోది ప్రత్యేక స్థానమనే చెప్పాలి. ఇప్పుడు తాజాగా వివో నుంచి మరో ప్రీమియం మొబైల్ ఫోన్ రాబోతోంది. అదే వివో ఎక్స్21. డిస్‌ప్లేలోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండడంతో ఈ ఫోన్ చాలా ప్రత్యేకమై పోయింది. మే 29న లాంచ్ కాబోతున్న ఈ ఫోన్‌కు ఇప్పటికే ప్రీ బుకింగ్‌లు కూడా ప్రారంభమైపోయాయి. వివో ఆన్‌లైన్ స్టోర్‌లో రూ.2 వేలు అడ్వాన్స్ కట్టేసి ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఇక, ఈ ఫోన్‌ను అధికారికంగా ఫ్లిప్‌కార్ట్‌లో అమ్ముతోంది వివో. గత మార్చిలోనే చైనా మార్కెట్లోకి ప్రవేశించిన వివో ఎక్స్21 తాజాగా భారత మార్కెట్లోనూ ఎంటర్ కాబోతోంది. ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారికి పలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది వివో. ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వడమేగాకుండా, నో కాస్ట్ ఈఎంఐ (వడ్డీ లేని వాయిదా) ఆఫర్‌ను ఇస్తోంది. అంతేనా వెయ్యి రూపాయల విలువైన ఫెర్న్స్ అండ్ పెటల్స్ గిఫ్ట్ ఓచర్‌ను కూడా ఇవ్వబోతోంది. 

వివో ఎక్స్21 ధర...
ప్రస్తుతానికి ధరను సస్పెన్స్‌గానే ఉంచింది సంస్థ. అయితే, ఇప్పటికే చైనా, సింగపూర్‌లలో ఆ ఫోన్ అమ్మకాలు జరుగుతున్నాయి. అక్కడి ధరల ప్రకారం అయితే రూ.40 వేల దాకా ఖర్చు అవుతుంది. చైనాలో ఎక్స్ 21ను 3,598 యువాన్లకు అమ్ముతున్నారు. అంటే ఆ ధర ప్రకారం చూసుకుంటే భారత మార్కెట్లో దాని ధర వచ్చేసి రూ.37,100 వరకు ఉండొచ్చు. అదే సింగపూర్‌లో 799 సింగపూర్ డాలర్లకు అమ్ముతున్నారు. ఆ ధర ప్రకారం చూసుకుంటే భారత్‌లో ఫోన్ విలువ రూ.39,900 వరకు ఉంటుంది. అయితే, ప్రస్తుతానికి భారత్‌లో ధర ఎంతనేది తేలలేదు. 

ఎక్స్21 ప్రత్యేకతలు..
వివోలోని అన్ని ఫోన్లలాగే ఇది కూడా డ్యుయల్ సిమ్‌ ఫోన్. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో వెర్షన్‌పై ఫన్‌టచ్ ఓఎస్ 4.0 సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుందిది. 19:9 యాస్పెక్ట్ రేషియోతో 6.28 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1080/2280 పిక్సెల్స్) డిస్‌ప్లే. ఇక, దీనికి అదనపు హంగు డిస్‌ప్లేలో ఫింగర్ ప్రింట్ స్కానర్ రావడం. ప్రస్తుతం అన్ని ఫోన్లలోనూ ఫింగర్ ప్రింట్ స్కానర్ హోం బటన్‌లో లేదంటే వెనక భాగంలో ఉంటున్నాయి. దానికి కొంచెం భిన్నంగా ప్రయత్నించింది వివో.

ఆడ్రినో 512 జీపీయూ, 6జీబీ ర్యాంతో కూడిన క్వాల్‌కం స్నాప్‌డ్రాగన్ 660 ఎస్వోసీతో నడుస్తుంది ఎక్స్21. ఇక, కెమెరా విషయానికొస్తే డ్యుయల్ రేర్ కెమెరాతో వస్తోంది. ఎఫ్/1.8 అపెర్చర్‌తో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 అపెర్చర్‌తో 5 మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా. ఎఫ్/2.0 అపెర్చర్‌తో 12 మెగా పిక్సెల్‌తో ఫ్రంట్ కెమెరా. 128 జీబీ ఇంటర్నల్ మొమొరీతో పాటు మైక్రో ఎస్డీ కార్డుతో ఆ మెమొరీని పెంచుకునే వెసులుబాటుంది. 

English Title
With That Feature Vivo X21 Highlighted
Related News