భూమిక.. ఓ దెయ్యం

Updated By ManamThu, 03/22/2018 - 03:29
BHOOMIKA

BHOOMIKAకన్నడలో విజయం సాధించిన ‘యూ టర్న్’ చిత్రాన్ని తెలుగులో సమంత రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు నేటివిటీకి, తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు దర్శకుడు పవన్‌కుమార్. ఈ సినిమాలో సమంత ఓ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తుండగా, భూమిక దెయ్యం పాత్రలో కనిపిస్తుందట. కథ ప్రకారం భూమిక పోషించే పాత్ర చాలా చిన్నదైనప్పటికీ కథలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఈ కన్నడ రీమేక్‌పై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. 

Tags
English Title
Figure .. A devil
Related News