కాంగ్రెస్‌కు పట్టం!

Updated By ManamMon, 09/10/2018 - 22:32
rosaiah
  • ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. పార్టీ శ్రేణులు కష్టపడాలి

  • కార్యకర్తలకు రోశయ్య పిలుపు.. ఆంధ్రరత్న భవన్‌లో సన్మానం

rosaiah

విజయవాడ: కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దానిని సాధించుకోవటానికి పార్టీ శ్రేణులు కష్టపడాలని మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. సోమవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన కొణిజేటి రోశయ్య.. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ఏపీసీసీ కార్యాలయాన్ని సందర్శించారు. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, సీనియర్ నేతలు ఆయనను సాదరంగా ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో రోశయ్య మాట్లాడారు. చాలా సార్లు విజయవాడ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు రాలేదని, రఘువీరారెడ్డి కోరిక మేరకు ఆంధ్రరత్న భవన్‌కు వచ్చాన్నారు. ఎటు వెళ్లినా కాంగ్రెస్ పార్టీ జెండా కనబడితే ఉత్సాహం కలుగుతుందని అన్నారు. కాంగ్రెస్ జెండా ఎగరాలని కోరుకునే వారిలో తాను మొదట ఉంటానుని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, పార్టీ శ్రేణులు కష్టపడాలని సూచించారు. తాను విజయవాడ రావడం కూడా కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఇప్పుడు పార్టీకి ఏమి చేయాలన్నా తనకు శక్తి సరిపోదని, ఉన్నవారు మాత్రం శక్తిని కూడగట్టుకొని పార్టీ కోసం పని చేయాలని కోరారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని తాననుకోవటం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని రోశయ్య చెప్పారు. 

కాంగ్రెస్‌లోకి చేరికలు
తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరానికి చెందిన గంగిశెట్టి గంగాధర్ అధ్వర్యంలో సుంకర పాలెం సర్పంచ్ శ్రీనివాస్ కిరణ్‌తో పా టు దాదాపు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి రఘువీరారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బొంత శ్రీనివాస్, బొంత సత్యనారా యణ, వాసశెట్టి సత్యనారాయణ, కె.సత్యనారా యణ, వీరాబాబు, మగాపు గంగధర్, ఎడిద సూరిబాబు, గాడిబాబురావు ఉన్నారు. 

English Title
Get to the Congress!
Related News