గూగుల్ గుప్పిట్లో ‘నిమజ్జనం’

Updated By ManamSun, 09/23/2018 - 03:45
ganesh nimajjanam
  • ప్రశాంత నిమజ్జనానికి సకల ఏర్పాట్లు

google mapహైదరాబాద్: వినాయక నిమజ్జన ఉత్సవాలు అంతర్జాలం గూగుల్ ద్వారా కవర్ చేయనున్నారు. ఏనంబర్ విగ్రహం ఎక్కడ ఉంది. నిర్దేశితరూట్లలో ఏమైనా ఆటంకాలు కలగనున్నాయా అన్న పూర్తిస్థాయి సమాచారం గూగుల్ ద్వారా పోలీ సులకు ఎప్పటికప్పుడు సమాచారం అందనుంది. దీనితోపాటు ప్రతి మొబైల్‌లో వారి వారి వినాయకుడి యాత్ర ఎక్కడ ఉంది అనే సమాచారం సైతం మండప నిర్వాహకులు, భక్తులు వీక్షించే అవకాశం పోలీసుల సహాయసహాకారాలతో గూగుల్ అందించనుంది. రంగంలోకి బాంబ్ డిస్పోజల్, షీటీం, సిటీర్యాపిడ్ యాక్షన్‌పోర్స్, నేర నిర్ములన విభాగాలతో పాటు మరికొన్ని ప్రత్యేక బృందాలు నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రంగంలోకి దిగాయి. విధుల్లో ఉన్న పోలీసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచీనీరు, ఆహారం , తదితర సౌకర్యాలను పోలీస్‌శాఖ కల్పించింది. అధునా తన కేమేరాలు, ఆర్ధ్దరాత్రి కూడా పట్టపగలను తలపించే రీతిలో విద్యుత్ కాంతులు, భక్తులకు మెరుగైన భద్రత వివిధ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

image


ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు..
నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు భక్తులకు, సిబ్బందికి కలిగినా వెంటనే వైద్యం అందించేందుకు అధికారులు ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. దీనితో పాటు అత్యవసర వైద్యసదుపాయాలతో ప్రత్యేకంగా వీరికొరకు ఉస్మానియా, గాంధీ, నిమ్స్, సరోజీనిదేవి దవాఖానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా అంబులెన్సులను ఏర్పాటు చేశారు.

నిమజ్జనానికి హైటెక్ ఏర్పాట్లు: డీజీపీ
వినాయక నిమజ్జనం సందర్బంగా పకడ్భందీగా హైటెక్ ఏర్పాట్లు చేశామని తెలంగాణ డీజీపి మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం గణనాథుని నిమజ్జనం పై భద్రతా ఏర్పాట్ల గురించి మీడియాతో మాట్లాడిన డిజిపి 31 జిల్లాల్లో వినాయక  నిమజ్జనం ప్రక్రియను తన కార్యాలయం నుండి లైవ్‌లో వీక్షించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో లోతైన చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు ఫేషియల్ రేకగ్నైజ్‌డ్  కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వినాయక నిమజ్జనం ఏర్పాట్లను జియో ట్యాగింగ్ చేశామని, 65వేల మంది పోలీసులు ప్రతక్ష్యంగా, పరోక్షంగా విధుల్లో ఉంటారని డిజిపి వెల్లడించారు. మహిళలను, అమ్మాయిలను వేధించే పోకిరీలను గుర్తించేందుకు షీ టీమ్‌లను రంగంలోకి దించామన్నారు. సున్నిత ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా పెట్టామని ఆయన వివరించారు.

English Title
Google gumppit 'immersive'
Related News