హఫీజ్ సయీద్ ఉగ్రవాదే

Updated By ManamTue, 02/13/2018 - 23:59
hafeez-saeed-
  • అంతర్జాతీయ ఒత్తిడితో ఎట్టకేలకు ప్రకటించిన పాక్ 

  • 26/11 దాడుల సూత్రధారి అక్కడే ఇన్నాళ్లూ మకాం

hafeez-saeed-ఇస్లామాబాద్: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని చిగురుటాకులా వణి కించిన 26/11 ఉగ్రదాడుల సూత్ర ధారి, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ అధిపతి హఫీజ్ సయీద్ ఉగ్ర వాదేనని పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడితో ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. సయీద్ అనుచ రు లు జమాత్ ఉద్ దవా బయట ఏర్పాటుచేసిన బారికేడ్లను పోలీసులు తొలగించడంతో ఈ విషయం స్పష్టమైంది. భద్రత పేరుతో దాదాపు దశాబ్ద కాలం క్రితం ఈ బారికేడ్లు ఏర్పాటుచేశారు. సుప్రీంకోర్టు ఆదేశా ల మేరకు మొత్తం 26 ప్రదేశాల్లో బారికేడ్లను తాము తీసేశామని, వాటి లో జమాత్ ఉద్ దవా ప్రధాన కార్యాలయం వద్దవి కూడా ఉన్నాయని లాహోర్ డీఐజీ డాక్టర్ హైదర్ అష్రఫ్ తెలిపారు.  ఐక్యరాజ్యసమితి భద్రతామండలి నిషేధించిన సంస్థలైన లష్కరే తాయిబా, జమాత్ ఉద్ దవా, హర్కత్ ఉల్ ముజాహిదీన్ లాంటివాటితో పాటు వాటికి సంబం ధించిన వ్యక్తులందరినీ ఉగ్రవాద వ్యతిరేక చట్టం 1997 కిందకు తీసు కొస్తూ పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ మంగళవారం ఒక ఆర్డి నెన్సు మీద సంతకం చేశారు. ఐక్యరాజ్యసమితి నిషేధించిన సంస్థల జాబితాలో మొత్తం 27 ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఆటా చట్టం కింద కు తేవడంతో హఫీజ్ సయీద్ లాంటి వాళ్లకు కష్టకాలం వచ్చినట్లే. ప్రధానంగా భారత్, అమెరికా లాంటి దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి తో.. త్వరలో ప్యారిస్‌లో జరగబోయే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో పాకిస్థాన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశం ఉందని తెలియడం వల్లే ఇప్పుడు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇలా బ్లాక్‌లిస్టులో పెడితే అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో పాకి స్థాన్ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో 2012 ఫిబ్రవరి నుంచి మూడేళ్ల పాటు పాక్ ఇలాగే బ్లాక్‌లిస్టులో ఉంది. 

English Title
Hafiz Saeed is a terrorist
Related News