సిగరెట్‌తో రాకెట్ లాంచింగ్.. వైరల్ వీడియో!

Updated By ManamThu, 08/30/2018 - 16:05
viral video, man lights rockets, cigarette, NASA, SpaceX, Netizens jokes

viral video, man lights rockets, cigarette, NASA, SpaceX, Netizens jokesరాకెట్ లాంచింగ్ చేయాలంటే ఎంతో ఖర్చు, శ్రమతో కూడిన పని. కానీ, ఈ స్పేస్‌మెన్ మాత్రం.. సింపుల్‌గా సిగరెట్‌తో రాకెట్‌ను అవలీలగా ఎగురవేస్తున్నాడు. ఒక్కదాని తరువాత మరొకటి నింగిలోకి భలే వదులుతున్నాడు చూడండి. నడిరోడ్డుపై నిలబడి చేతిలో టపాసు రాకెట్లను పట్టకొని.. స్టైల్‌గా సిగరెట్‌ కాలుస్తూ సరికొత్తగా నింగిలోకి లాంచ్ చేస్తున్నాడు. ఇతగాడు ఎవరో తెలియదు గానీ, నింగిలోకి రాకెట్లు వదులుతుంటే అటుగా వెళ్లే వాహనదారులంతా నోరెళ్లబెట్టి చూస్తున్నారు.

టపాసు రాకెట్లను నింగిలోకి వదులుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా నాసాకు కొత్త భారతీయ శాస్త్రవేత్త, స్పేస్ఎక్స్ దొరికాడు అంటూ ట్యాగ్‌లు తగిలించి సరదాగా కామెంట్లు చేస్తున్నారు. రాకెట్ లాంచింగ్ స్కిల్స్ అంటే ఇతగాడివేనంటూ జోకులు పేలుస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో..

English Title
Have you seen this viral video of a man who lights rockets using a cigarette
Related News