సింధు, శ్రీకాంత్‌లపైనే ఆశలు

Updated By ManamWed, 03/14/2018 - 01:32
sindhu srikanth

నేటి నుంచి ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ
sindhu srikanthఆల్ ఇంగ్లండ్ ఓపెన్...బ్యాడ్మింటన్  క్రీడలో అత్యుత్తమ టోర్నీ.  టెన్నిస్‌లో గ్రాండ్‌శ్లామ్‌లా,  క్రికెట్‌లో ప్రపంచ కప్‌లా  ఈ మెగా టోర్నీలో ఆడాలని, గెలవాలని ప్రతి క్రీడాకారుడి కల. 1980లో ప్రకాశ్ పడుకొనే.. ఆ తర్వాత 21 ఏళ్ల విరామం అనంతరం  పుల్లెల గోపీచంద్ (2001) ఈ టోర్నీలో గెలు పొంది భారత్ బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్రను తిరగరా శారు. ఆ తర్వాత సైనా నెహ్వాల్ రెండేళ్ల క్రితం మెరుపులు మెరిపిం చినా పతకం గెలుచుకోలేక పోయింది . ఇప్పుడు భారత బ్యాడ్మింటన్‌కు స్వర్ణ యుగం నడుస్తోంది.  రియో ఒలింపిక్ స్టార్ సింధు,   గ్రాండ్‌ప్రి విజేత శ్రీకాంత్‌లతో పాటు యువ సంచల నాలు చాలా మంది ఈ సారి ఈటోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోను న్నారు.   17 ఏళ్ల నుంచి అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఈ  ఆల్ ఇంగ్లండ్ టోర్నీ టైటిల్‌ను భారత ఆటగాళ్లు గెలుచుకొస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 బర్మింగ్‌హామ్ :  ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌కు అంతా రెడీ అయింది. నెల రోజుల పాటు హైదరాబాద్ లో కోచ్ గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన భారత ప్లేయర్ల  సత్తాకు ఈ టోర్నీ అగ్నిపరీక్ష కానుంది.   ఇవాళ్టి నుంచి జరిగే ప్రతిష్ఠాత్మక టోర్నీలో  భారత సెన్సేషనల్ స్టార్ సైనాకు కఠినమైన డ్రా ఎదురవవగా రైజింగ్ స్టార్ సింధుకు పోటీ అనుకూలంగా ఉంది.  టైటిల్ కోసం  సైనా  అసాధారణంగా పోరాడాల్సిందే. తొలి రౌండ్‌ను అధిగమించాలంటే రాకెట్ క్వీన్ ప్రపంచ నెంబర్‌వన్‌ను ఓడించాలి. సైనా తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ తై జు యింగ్‌ను  ఢీకొనబోతోంది.. తైజుతో గత ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయమైనా  సైనా సాధించలేదు.  ఇక  సైనాతో పోలిస్తే  రైజింగ్  స్టార్ సింధుకు సులువైన డ్రా ఎదురైంది.  నాలుగో సీడ్‌గా బరిలో దిగుతున్న రియో ఒలింపిక్స్ క్విన్...  ఫస్ట్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ ప్లేయర్ పోర్న్‌పవి చోచువాంగ్ తో తలపడనుంది. రెండో రౌండ్లో ఇండియా ఓపెన్ విజేత  చైనా ప్లేయర్ బివెన్ జాంగ్  ఎదురయ్యే అవకాశముంది. వరల్డ్ బ్యాడ్మింటన్‌లో  ఒక్కో డ్రీమ్‌ను నెరవేర్చుకుంటున్న  యంగ్ రాకెట్....ఈ సారి ఆల్ ఇంగ్లండ్ సాధించాలని పట్టుదలగా ఉంది.   2017లో క్వార్టర్ ఫైనల్ దాకా వచ్చిన సింధు  ఈ సారి పతకం ఖాయమని ధీమాగా చెబుతోంది. 

 హాట్ ఫేవరెట్ శ్రీకాంత్
 పురుషుల విభాగంలో మూడో సీడ్,  భారత యువ సంచనలంఓ కిదాంబి శ్రీకాంత్ హాట్‌ఫేవరెట్‌గా బరిలో దిగుతున్నాడు. ప్రపంచ ర్యాంకుల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న శ్రీకాంత్  తొలి రౌండ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు బ్రిస్ లావర్డెజ్‌తో ఆడతాడు. 2017లో నాలుగు సూపర్ సిరీస్‌లు గెలుచుకుని సంచలనం సృష్టించిన శ్రీకాంత్  ఈ టోర్నీలో డెన్మార్క్ ఆటగాడు  వరల్డ్ నంబర్ వన్ విక్టర్ అలెక్సెన్‌తో పాటు మలేసియా స్టార్ లీ చాంగ్ విల నుంచి గట్టిపోటీ ఎదుర్కొనే అవకాశముంది.  ఇక భారత రైజింగ్ స్టార్ సింగపూర్  ఓపెన్  విజేత సాయి ప్రణీత్, 12వ ర్యాంక్ ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్‌లు కూడా సింగిల్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షిం చుకోనున్నారు.   మాజీ వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు  సోన్ వాన్ హో (కొరియా)తో  ప్రణీత్ తొలి రైండ్‌లో ఆడతాడు.  చైనీస్ తైపీకి చెందిన తిన్‌చెన్‌తో ప్రణయ్ తొలి మ్యాచ్‌ను ఆడతాడు. ఇటీవలే కాలి గాయం నుంచి కోలుకున్న ప్రణయ్ ఈ టోర్నీలో సత్తాచూపెట్టబోతున్నాడు. డబు ల్స్ విభాగంలోనూ భారత్ ఈ టోర్నీలో సత్తా చూపెట్టేందుకు రెడీ అయింది. ఇండోనేసియా ఓపెన్ సెమీఫైనల్ జోడి చిరాగ్ శెట్టి, స్వస్తిక్ సిరాజ్‌లకు తొలి రౌండ్‌లో గట్టిపోటీ ఎదురైంది.   మహిళల డబుల్స్‌లో  అశ్విన్ పొన్నప్ప, సిక్కిరెడ్డిలు  రెండో సీడ్ జపాన్ జోడి మిసాకి , అయెకాలతో పోటీపడుతుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ప్రణవ్ చోప్రా, సిక్కిరెడ్డి జంట జర్మన్ జంట మార్విన్, లిండాలతో పోటీపడుతుంది.

కల నెరవేరుస్తా : సింధు
ఆల్ ఇంగ్లండ్‌లో గెలవాలనే నా కోరిక ఈ సారి తీరుతుందని ఆశిస్తున్నా. ఈ టోర్నీలో గెలిచి నంబర్ వన్ కావాలన్న నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకుం టున్నా...  ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు ఇటీవలే కొత్తగా సొంత ఫిజియోను కూడా నియమించుకున్నా.  ముంబైకి చెందిన గాయత్రి నాతో కలిసి పని చేస్తోంది. గాయత్రి  శిక్షణతో నాలో చాలా మార్పు కూడా వచ్చింది. శరీరంపై అధిక భారం పడకుండా, అదే విధంగా ఎలాంటి లోపాలు లేకుండా ప్లానింగ్‌తో ఫిట్‌నెస్ ట్రైనింగ్ చేయడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మానసికంగా కూడా మరింత ద ఢంగా మారాను.  ఇటీవల నా ఆటలో కొన్ని మార్పులు చేయడం తప్పనిసరిగా మారిపోయింది. తై జు లాంటివాళ్లు తెలివిగా తప్పు దోవ పట్టించే షాట్‌లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా జపాన్ క్రీడాకారిణులు కూడా సుదీర్ఘ ర్యాలీలపైనే ద ష్టి పెట్టారు. గతంలో నా బలం స్మాష్‌ను సమర్థంగా ఉపయోగించుకునేదాన్ని. అయితే నా ప్రత్యర్థులు షటిల్‌ను ఏమాత్రం పైకి లేపకుండా ఆడుతూ స్మాష్‌కు అవకాశం ఇవ్వడం లేదు. దాంతో నేను కూడా కొత్తగా ఆలోచించాల్సి వచ్చింది.  

పతకం ఖాయం : గోపీచంద్
ఆల్ ఇంగ్లండ్ టోర్నీ కోసం గత రెండు వారాలుగా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. ఇతర సూపర్ సిరీస్ టోర్నీలతో పోలిస్తే ఆల్ ఇంగ్లండ్‌కు అందరి ద ష్టిలో క్రేజ్ ఉన్నా... ఆ పేరుతో ఆటగాళ్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం లేదు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో   సిద్ధమై ఆడుతున్న తొలి టోర్నీ ఇదే. మంచి ఫలితాలు సాధించేందుకు తీవ్రంగా శ్ర మించాం. ముఖ్యంగా సింధు, శ్రీకాంత్‌లకు మంచి అవకాశం ఉందని చెప్పగలను. సానుకూల ఫలితాలు ఆశిస్తున్నాం.  ఆల్ ఇంగ్లండ్ తర్వాత వెంటనే కామన్వెల్త్ క్రీడలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా కూడా ద ష్టి పెట్టి ప్రాక్టీస్ చేశాం. బీడబ్ల్యూఎఫ్ కొత్త షెడ్యూల్ కారణంగా మన ఆటగాళ్లకే ఎక్కువగా నష్టం జరగనుంది. 2018కి సంబం ధించిన పూర్తి షెడ్యూల్‌ను ఆటగాళ్లకు ఇప్పటికే అందించాను. కొత్త షెడ్యూల్ పరీక్ష ఇప్పుడు మొదలైంది. ఏడాదికి 12 టోర్నీల్లో కచ్చితంగా ఆడాల్సిన స్థితిలో టోర్నీ, ప్రిపరేషన్ కలిపి కామన్వెల్త్, ఆసియా క్రీడలకు రెండు నెలల టైమ్ పోతుంది. బ్యాడ్మింటన్ ప్రపంచంలో భారత్‌కు, మలేసియాకు మాత్రమే ఇప్పుడు సమస్య ఉంది. దేశం తరఫున పతకం కోసం కాబట్టి మా ఆటగాళ్లెవరూ పెద్ద ఈవెంట్లకు దూరం కావడం లేదు.
 
  కొత్త రూల్స్‌పై విముఖత
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ద్వారా కొత్తగా అమల్లోకొచ్చిన నిబంధలపై కోచ్‌లతో పాటు క్రీడాకారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ మధ్యలో కోచింగ్ సమయాన్ని తగ్గించటం,  ఇప్పటి వరకూ ఉన్న మూడు సెట్లను   ఐదు సెట్లుగా మారి గేమ్ పాయింట్‌ను 21 నుంచి 11కు తగ్గించాలన్న రూల్స్‌తమపై ఒత్తిడి పెంచుతాయని పలువురు ప్లేయర్లు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య  కొన్ని నిబంధనలు అమల్లోకి తెచ్చింది.మరికొన్నింటిని  త్వరలో అమలు చేయనున్నారు.
కొత్త నిబంధనలు
సర్వీస్ సమయంలో షటిల్‌ను తాకేప్పుడు రాకెట్ కోర్టు నుంచి 1.15 మీటర్లు మించి ఎత్తు ఉండకూడదు.  ఈ నిబంధన పీవీ సింధు లాంటి ప్లేయర్లకు ఇబ్బంది.
ఇప్పటి వరకూ 21 పాయింట్ల గేమ్ మూడు సెట్లుగా ఉండేది .ఇప్పుడు  గేమ్‌ను ఐదు సెట్లుగా మార్చి 11 పాయింట్లకు తగ్గించారు. దీంతో ఆరంభంలో వెనుకబడ్డ ప్లేయర్లు తర్వాత పుంజుకునే లోగా సెట్ అయిపోతుంది.
సెట్‌మధ్యలో 11 పాయింట్లు అయ్యాక బ్రేక్ ఉంటుంది. ఈ సమయంలో కోచ్‌తో ఆటగాళ్లు మాట్లాడుకోవచ్చు. తప్పుగా ఆడుతుంటే కోచ్ సూచనలు సలహాలు ఇవ్వొచ్చు. అయితే ఈ సమయాన్ని  తగ్గించారు
టాప్ -15 ర్యాంక్ ప్లేయర్లు ఏడాదిలో కనీసం 12 టోర్నీలు ఆడాలన్న నిబంధన అమల్లోకి రానుంది. ఇది చాలా కష్టమని కోచ్‌లు, ఆటగాళ్ల అభిప్రాయం.

పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా : శ్రీకాంత్
గత ఏడాది నాకు అద్భుతంగా గడిచింది. ఈ సంవత్సరం ఇండియా ఓపెన్‌లో సానుకూల ఫలితం రాలేదు కానీ ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నా. ఫిట్‌నెస్ పరంగా ప్రస్తుతం 100 శాతం బాగున్నాను. ప్రత్యేకంగా సన్నాహాలు లేకపోయినా గత రెండు వారాలుగా బాగా శ్రమించాను. ఈ కష్టం ఫలితాల రూపంలోకి మారాలని కోరుకుంటున్నా.  సింగిల్స్ కోచ్‌గా మంచి ఫలితాలు అందించిన ముల్యో జట్టుకు దూరం కావడంతో మరీ పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు కానీ ఆయన శిక్షణ సమయంలో కొన్ని రకాల ఆలోచనలు, ప్రత్యర్థిని ఎదుర్కొనే విషయంలో కొన్ని వ్యూహాలకు అలవాటు పడ్డాం. ఇప్పుడు మళ్లీ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే గోపీ సర్ ఉన్నారు కాబట్టి సమస్య లేదు. 

English Title
Hopes on Indus and Srikanth
Related News