మన శరీరంలో దాగున్న అద్భుతాలు

Updated By ManamTue, 02/13/2018 - 18:36
human body

human bodyశాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా.. చంద్రమండలాన్ని దాటి.. అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్నా మనిషి మేధస్సుకు అంతుచిక్కని అద్భుతంలో ఈ అనంత విశ్వంలో కోకొల్లలు.. ఇప్పటికి మనకి తెలిసింది సముద్రంలో ఇసుక రేణువంత మాత్రమే.. ఇంకా తెలియాల్సింది.. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అలాంటి వాటిలో ఒకటి మానవ శరీరం. భగవంతుని అద్భుత సృజనాత్మకతకు గీటురాయి మనిషి శరీర నిర్మాణం. పుట్టుక నుంచి మరణం వరకు ఎన్నో ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పనిచేసే ఒక అలుపు లేని మెషిన్ హ్యూమన్ బాడీ. దీని గురించి కొన్ని ఆసక్తికరమైన, నమ్మలేని నిజాలు మీకోసం.

* శరీరం నుంచి తలను తప్పిస్తే.. తల 15 నిమిషాల వరకు స్పృహలోనే ఉంటుందట.
* నిద్రపోతున్నప్పుడు మన ముక్కు వాసన గుర్తించలేదు.
* జీర్ణాశయంలో ఉండే ఆమ్లము రేజర్ బ్లెడ్‌లను కూడా కరిగించగలదట.
* మన గుండె ఒక్క రోజులో ఉత్పత్తి చేసే శక్తితో ఓ ట్రక్‌ని సుమారు 30 కిలోమీటర్ల వరకు నడిపించగలదు.
* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏ రసాయనాలు సాయపడతాయో.. మనం మరణించిన 3 రోజులకి అవే మనల్ని తినేస్తాయట
* కెమెరాతో మన కంటిని పోలిస్తే.. అది 576 పిక్సెల్స్‌ ఉంటుందట.
* మన నాలుక 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.
* మన బెడ్‌పై ఉండే దుమ్ములో సగం మన చర్మం విసర్జించిందే.
* ఒక్క అంగుళం చర్మం మీద సుమారు 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుందట.
* మెదడు ఏదైనా అవయవానికి సమాచారం పంపిస్తే.. అది గంటకు 268 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందట.
* కొన్ని లక్షల కంప్యూటర్లలో స్టోర్ చేయగలిగినంత మెమొరీని దాచవచ్చట.
* ఊపిరితిత్తులను పూర్తిగా విడదీస్తే.. అది 50 నుంచి 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పరచుకుంటుందట. అంటే అది దాదాపు ఓ టెన్నిస్ కోర్ట్ వైశాల్యంతో సమానం.

English Title
human body interesting facts
Related News