జన్యు పరిశోధనలకు హైదరాబాద్ అనుకూలం

Updated By ManamMon, 08/13/2018 - 05:32
jogu
  • కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్

  • 260 మూషిక జింకల పునరుత్పత్తి 

  • వన్య ప్రాణుల జన్యు వనరుల బ్యాంక్ ప్రారంభం

  • హజరైన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న

imageహైదరాబాద్:  వన్య ప్రాణుల జన్యువనరులకు వాటి పరిశోధనలకు హైదరాబాద్ అనుకూలంగా ఉందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. ఆదివారం సీసీయంబీ లాక్సోన్ పరిశోధన కేంద్రను సందర్శించారు. అంతరించిపోతున్న వన్యజీవి మూషిక జింకను పునరుత్పత్తి చేసీ వాటిని అడవిలోకి పంపించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రం మంత్రి హర్షవర్థన్ హాజరైనారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. నగరంలోని లాకోన్స్ పరిశోధన కేంద్ర చాలా భాగుందని, ఇక్కడ అంతర్జాతీయ స్థాయి వనరులు ఉన్నాయన్నారు. అంతర్జాతీయ  స్థాయికి కావలసినా అన్ని పరికరాలను అమార్చి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. వన్య ప్రాణుల జన్యు వనరుల బ్యాంక్‌ను పారంభించడం సంతోషంగా ఉందన్నారు.

అంతరించిపోతున్న జీవులలో మూషిక జింకలు ఒక్కటనీ, శాస్త్రవేత్తలు చిత్తశుద్దితో పని చేసీ 7 సంవత్సరాలలోనే ఆరు మూషిక జింకల సంతతిని 260 జింకలను పునరుత్పత్తి చేయడం గొప్ప విషయమన్నారు. శాస్త్రవేత్తల కృషికి అద్భుత ఫలితాలు వచ్చాయని వారిని అభినందించారు. అంతరించి పోతున్న వన్యజీవులను కాపాడవలసినా బాధ్యత అందరి మీద ఉందని, పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నివిధాల సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం నెహ్రూ జూ పార్క్‌ను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి సందర్శించారు. జూ పార్క్‌లో ఉన్నా మూషిక జింకలను ఆమ్రాబాద్ అరణ్యానికి ప్రత్యేక వాహనంలో తరలించడానికి  మంత్రి జోగు రామన్నతో కలిసి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జూ పార్క్‌లో అరుదైన నల్ల హంసల ఎంక్లోసెర్‌ను ప్రారంభించిన మంత్రులు హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు.

English Title
Hyderabad is suitable for genetic research
Related News