మరింత కనిష్టానికి రూపాయి

Updated By ManamWed, 09/12/2018 - 10:52
Rupee

Rupeeముంబై: గత కొన్ని రోజులుగా పడిపోతూ వస్తున్న దేశీయ కరెన్సీ రూపాయి తాజాగా మరింత కనిష్టానికి చేరింది. బుధవారం ఆరంభంలోనే 41పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్ మారకంలో రుపాయి విలువ 72.91 స్థాయిని తాకింది. ముడిచమురు ధరలు పెరగడంతో పాటు విదేశీ మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో బ్యాంకులు, దిగుమతి దారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో రూపాయి విలువ అంతకంతకూ పడిపోతోంది. మరోవైపు రుపాయి పతనం దేశీయ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. కీలక సూచీ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ కూడా 151 పాయింట్లు క్షీణించి 11, 288 వద్ద ముగిసింది.

English Title
Indian rupee keeps on sliding
Related News