చెన్నై ఖాతాలో మరో ఐపీఎల్

Updated By ManamSun, 05/27/2018 - 23:14
image

imageముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 11వ సీజన్ ఛాంపియన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. రెండు సంవత్సరాల నిషేధం తర్వాత ఈ సీజన్‌తో బరిలోకి దిగిన చెన్నై జట్టు అన్ని విభాగాల్లో అత్యద్భుత ప్రదర్శనతో ట్రోఫీని దక్కించుకుంది. ధోనీ సారథ్యంలో ఈ ఫ్రాంచైజీ మూడో సారి ఐపీఎల్ ఛాంపియన్ అయింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అయితే 179 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకి హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. బ్యాట్స్‌మెన్ల పై ఒత్తిడి తెస్తున్నారు. సందీప్ శర్మ వేసిన 4వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి సందీప్‌కే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ దశలో వాట్సన్ జట్టుకు అండగా నిలిచాడు. పవర్‌ప్లే అనంతరం సురేష్ రైనాతో కలిసి రెచ్చిపోయాడు. సిద్ధార్త్ కౌల్ వేసిన రెండు ఓవర్లలో 32 పరుగులు చేసిన చెన్నై జట్టు క్రమంగా రన్‌రేటును తగ్గించుకుంటూపోయారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ బౌలర్ సందీప్ శర్మ 13వ ఓవర్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్ వాట్సన్ చెలరేగిపోయాడు. ఈ ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో వాట్సన్ 57 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సులు బాది 117 పరుగులు చేసి ఈ సీజన్‌లో శతకాన్ని నమోదు చేశాడు. దీంతో చెన్నై విజయం సునాయాసం అయింది. చివర్లో సన్‌రైజర్స్ బౌలర్లు కట్టిడి చేసేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండాపోయింది. 18.3 ఓవర్లలో 181 పరుగులు చేసి విజేతగా నిలిచింది.

English Title
ipl winner chennai super kings
Related News