నిజమే... బీజేపీ భిన్నమైనదే!

Updated By ManamSun, 05/27/2018 - 01:53
modi

imageచరిష్మా ఉన్నంత మాత్రాన చరిత్ర సృష్టించడం కష్టవేునని గత నాలుగేళ్ల నుంచి ఎన్‌డీఏ ప్రభుత్వ అధినేతగా ఉన్న నరేంద్ర మోదీ రుజువుచేశారు. దేశంలోని సంప్రదాయ పార్టీలకు తమది భిన్నైమెన పార్టీ అని మొదటి నుంచి ఊరూవాడా ఏకమై చెప్పుకునేలా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభివర్ణించుకుంది. తన గొప్పతనాన్ని గురించి తమకు తామే ఎవరూ వైుకులుపెట్టి ప్రకటించుకోరు. ఎదుటి వ్యక్తి వారిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించినప్పుడు తగిన విలువ, గౌరవం ఉంటా యి. అలా లభించిన విలువను గౌరవాన్ని అందరూ నిలబెట్టుకోలేరు. పార్టీ వ్యవస్థాపకుైలెన అటల్ బీహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీలను ఇప్పుడు అనామకులను చేసేశారు బీజేపీ నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదంతో ఇతర పార్టీలను తమకున్న అధికార అహంకారంతో కొండచిలువలా మింగేస్తున్న ఆ ద్వయానికి ‘సీనియర్ నేతలు ముక్త్ పార్టీ’ అనడానికి ఎంతో కాలం పట్టలేదు. అదృష్టవశాత్తు వాజ్‌పేయి అనారోగ్యంతో రాజకీయాల నుంచి విరమించుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆయనకు కూడా బీజేపీలో ఇసుమంత గౌరవం లభించి ఉండేదికాదు. అద్వానీ పరిస్థితి చూస్తున్నాం కదా! పెద్దల యెడల అదీ తాను ఈ రోజు ఉన్నత పదవిలో కొనసాగడానికి కారకుైలెన పార్టీ వ్యవస్థాపకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మోదీకి దేశప్రజలపై అభిమానం, దేశం పట్ల గౌరవం ఉంటుందనుకోవడం భ్రమే కాగలదు. 

మోదీ ప్రధాని పదవి స్వీకరించి శనివారానికి సరిగ్గా నాలుగేళ్లు గడిచాయి. కాంగ్రెస్ కంటే తమది భిన్నమై న పార్టీ అని చెప్పుకునే మోదీ పూర్తిగా కాంగ్రెస్ మార్గంలోనే పయనిస్తున్నారు. తమ పార్టీని ఎన్నుకుంటే విదేశాల్లో కాంగ్రెస్ నాయకులు దాచుకున్న నల్లడబ్బును వెలికితెచ్చి దేశంలోని ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున బ్యాంకులో జమచేస్తానని చెప్పిన మోదీ అనంతరం బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బును దోచుకుని విదేశాలకు పారిపోయి లలిత్ మోదీ, నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా వంటి బడా పారిశ్రామికవేత్తలు విలాసవంతైమెన జీవితం గడుపుతుంటే చూస్తుండిపోయారు. కనీసం వారిని విదేశాల నుంచి రప్పించలేకపోయారు. అందుకని బీజేపీని ఇతర పార్టీల కంటే భిన్నైమెన పార్టీ అందామా? ఒకప్పుడు ఇందిరా గాంధీ హ యాంలో చంద్రస్వామి వంటి వారు పరోక్షంగా ప్రభుత్వాన్ని శాసించగా నేడు యోగులు ఏకంగా రాజకీయాలను ప్రత్యక్షంగా శాసిస్తున్నారు. అసలు ప్రజాప్రతినిధులే కాని బాబాలు కేబినెట్ ర్యాంకుల్లో ఉన్నారు. అందుకని భిన్నైమెన పార్టీ అనుకుందామా?
శ్యావ్‌ప్రసాద్ ముఖర్జీ విదేశాల్లో చనిపోతే ఆయన పార్థివ దేహాన్ని భారత్‌కు రప్పించే చర్యలను అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అడ్డుకున్నారని విదేశాల్లో మోదీ ప్రకటించడం ద్వారా చరిత్రను వక్రీకరించారు. ఇలా విదేశీగడ్డపై దేశ ప్రతిష్ఠను దిగజార్చే వ్యాఖ్యలు ఇంతకుముందు ఏ కాంగ్రెస్ నాయకుడూ చేయలేదు. అదొక బీజేపీ నాయకులకే దక్కిన గౌరవం. వాజ్‌పేయిలో భావి ప్రధానిని చూసిన నెహ్రూను చూసి నేర్చుకోవలసింది నేటి బీజేపీ నేతలకు ఎంతో ఉంది. ప్రతిపక్ష సభ్యులను గౌరవించే విధానం, తమను వ్యతిరేకించినంత మాత్రాన వారిని శత్రువులుగా పరిగణించ ని తీరును అలాంటి పాతతరంనేతల నుంచి నేర్చుకోవలసిందెంతో ఉంది. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, చేసిన చట్టాన్ని అమలు చేయకపోగా పచ్చి అబద్ధాలు అడుతున్న మోదీ సర్కారు తీరు చూ స్తుంటే నిజంగానే గతంలో ఇంత భిన్నైమెన నాయకత్వాన్ని, పార్టీని చూడలేదని అనుకుందామా? ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నిైకెన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సంగతి కర్ణాటక ఎన్నికల అనంతరం తేలుస్తామని పరోక్షంగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిైకెన జీవీఎల్ నరసింహారావు హెచ్చరించే నే తలున్న బీజేపీ నిజంగా ప్రత్యేకైమెన పార్టీయే! చంద్రబాబంటే మోదీని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆయనపై ఆగ్రహం ఉండడం సహజం కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ సందర్భంలోనూ మోదీని ఘాటుగా విమర్శించలేదు కదా! మరి ఆయనైపె మోదీకెందుకో కోపం అర్ధంకాని విషయం. అదే బీజేపీ ప్రత్యేకత అని సరిపెట్టుకుందాం. ఇవాళ మోదీని వ్యతిరేకిస్తున్న బీజేపీ సీనియర్ నేతలకు (ఒక విధంగా మోదీ కంటే సీనియర్లే అనుకోవచ్చు) వాజ్‌పేయి, అద్వానీల వ్యక్తిత్వం ఏమిటో తెలుసు. వారి నిజాయితీ, ప్రజాస్వామ్యం పట్ల వారికున్న గౌరవం తెలుసు. మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 13 రోజలు తరువాత మెజారిటీ సాధించటానికి తనకు ఒక్క ఓటు తక్కుైవెందని తెలుసుకున్న వెంటనే వాజ్‌పేయి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆయన ఎలాంటి హార్స్ ట్రేడింగ్‌లకు పాల్పడలేదు. అలాగే హవాలా డైరీల్లో తన పేరుందని తెలిసిన వెంటనే ఎంతమంది వారించినా వినిపించుకోకుండా లోక్‌సభ సభ్యత్వానికి అద్వానీ రాజీనామా చేశారు. ఇదీ ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల వారిద్దరికీ ఉన్న గౌర వం. మరి నేడు కర్ణాటకం చూసి మోదీ-షా ద్వయాన్ని ఏమని వర్ణించుకోవాలి? 

నోటిదురుసులో నోబెల్ బహుమతికి అర్హురాైలెన స్మృతి ఇరానీ వంటి వారికి మంత్రి పదవులు కట్టబెట్టి తనను కీర్తించే వందిమాగధలను పక్కన పెట్టుకున్న మోదీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు; రాజ్యాంగం పై గౌరవం లేదు; న్యాయవ్యవస్థపై విశ్వాసం చూపరు. రామాయణంలో సీత పాత్ర ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా టీవీ సీతగా నిలిచిన స్మృతి ఇరానీకి, నేటి రాజకీయ ఇరానీకి ఎంత వ్యత్యాసం? రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌కు కూడా తెలియకుండా పెద్దనోట్లు రద్దు చేసిన వైనం చూస్తుంటే మంత్రివర్గానికి కూడా తెలియకుండా చివరకు హోం మంత్రికి కూడా తెలియకుండా దేశంలో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని విధించిన విషయం గుర్తుకొస్తుంది. ఆ ఎమర్జెన్సీకి, నోట్లరద్దు ద్వారా విధించిన ఆర్థిక ఎమర్జెన్సీకి పెద్ద తేడా లేదు. ‘కాంగ్రెస్ విముక్త్ భారత్’ ద్వారా తమది కూడా కాంగ్రెస్ వ్యవహారైశెలి కాబట్టి ఇంకా కాంగ్రెస్ ఎందుకని ఆ నినాదం అర్ధమేమో తెలియదు. దేశంలో రాష్ట్రానికో విధానం అమలుచేయడం బీజేపీ భిన్నైవెఖరికి నిదర్శనంగా నిలుస్తుంది. 

ఒకప్పుడు తనను వ్యతిరేకించేవారిని ఇందిరాగాంధీ అంతర్గతంగా బెదిరించో, భయపెట్టో తన దారికి తెచ్చుకునేవారని చెబుతారు. కానీ మోదీ ద్వయానికి ఆ సహృదయత (?) ఉందని చెప్పలేం. తనను వ్యతిరేకించేవారంతా శత్రువులేనని, వారిని భౌతికంగా అంతమొందించడానికి కూడా నేటి బీజేపీ నేతలు సిద్ధమని అనేక రుజువులు కళ్లముందు నిలుస్తున్నాయి. గౌరీ లంకేశ్, కాల్బుర్గి వంటివారెందరో మోదీ విధానాలకు నిరసనలు తెలిపినందుకు హతులయ్యారు. సాక్షాత్తు బీజేపీ ఎమ్మెల్యేనే ఒక వైునర్ బాలికపై అత్యాచారం చేసిన ఉన్నావ్ ఘటన, జమ్ము-కశ్మీర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కథువా ఘటనలో నిందితులకు కొమ్ముకాసిన ఇద్దరు మంత్రు లు...ఇవన్నీ చూస్తుంటే బీజేపీ కచ్చితంగా ఇతరపార్టీల కంటే భిన్నైవెునదనే చెప్పుకోవడంలో తప్పులేదు కదా! జీఎస్‌టీని హడావుడిగా అమలులోకి తెచ్చి ప్రజల నెత్తిన ధరల భారం వేయడం, గతంలో ఎన్నడూ లేనంతగా చమురు ధరలు సామాన్యుణ్ణి కలవరపెట్టే చర్యలు అన్నీ బీజేపీని భిన్నంగానే ప్రజలకు చూపుతున్నాయి. 

 ఈ సంఘటనలే బీజేపీని 2019 ఎన్నికల సమయానికి ప్రజల ముందు దోషిగా నిలబెడతాయని అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికొస్తున్న సర్వేలు అవే చెబుతున్నాయి. ప్రజలు నెమ్మదినెమ్మదిగా బాహాటంగా తమ అసంతృప్తిని వ్యక్తంచేయడానికి వెనకాడడం లేదు. ఎంతో విశ్వాసంతో గత రెండు దశాబ్దాలుగా ఎవరికీ ఇవ్వని మెజారిటీ ప్రజల అందలం ఎక్కిస్తే ఆ విశ్వాసాన్ని నిలుపుకోలేక గతంలో ఏ పార్టీ కూడా ఇంత త్వరగా ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. అందుకే బీజేపీ నిజంగానే దేశంలోని అన్ని పార్టీలకంటే భిన్నైవెునదేనని భావించవచ్చు. ఇచ్చిన అధికారాన్ని ఐదేళ్లలోనే పోగొట్టుకున్న పార్టీలు గతంలో ఉన్నప్పటికీ అవన్నీ అంతర్గత కలహాలతో కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ, అంతర్గతంగా ఎలాంటి విభేదాలు బహిర్గతం కాకుండా పూర్తికాలం మెజారిటీలో కొనసాగి ఇలా వెనకడుగు వేయడం భిన్నమే మరి! తమది భిన్నైమెన పార్టీ అనిప్రచారంచేసుకుంటున్న బీజేపీ నేతల మాటల్ని మనం కాదనడం ఎందుకు? సరేనంటే పోలా...!

 తాడేపల్లి శివరామకృష్ణారావు

English Title
It is true ... the BJP is different!
Related News