వీడియో: జబర్దస్త్ టీం హల్‌చల్.. టీటీఈతో గొడవ

Updated By ManamWed, 04/25/2018 - 16:58
Jabardast Shaking Seshu in Colliding with TTE

Jabardast Shaking Seshu in Colliding with TTEవిశాఖపట్నం: రైల్లో జబర్దస్త్ టీం హల్‌చల్ చేసింది. జబర్దస్త్ ఫేం షేకింగ్ శేషు తన బృందంతో కలిసి విశాఖపట్నం వెళ్లేందుకు విజయనగరంలో హౌరా నుంచి హైదరాబాద్ వెళుతున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలెక్కారు. అయితే, వారు జనరల్ టికెట్‌పై థర్డ్ ఏసీలో ప్రయాణించారు. చెకింగ్‌కు వెళ్లిన టీటీఈ వారికి అభ్యంతరం చెప్పి ఫైన్ కట్టాల్సిందిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆ టీటీఈతో రైల్లో వారు వాగ్వాదానికి దిగారు. విశాఖపట్నంలో దిగిన తర్వాత కూడా వారు టీటీఈతో వాగ్వాదానికి దిగారు. ‘యూజ్‌లెస్ ఫెలోస్’ అని తిట్టాడంటూ వారు ఆరోపించారు. ఫైన్ కట్టించుకుంటే కట్టించుకోవాలి గానీ, ఇలా తిట్టడమేంటని టీటీఈతో గొడవ పెట్టుకున్నారు. వెంటనే టీటీఈ కూడా మరి, తననెందుకు కొట్టారంటూ ఎదురు ప్రశ్నించాడు. మీడియా రావడం గమనించిన జబర్దస్త్ టీం కాస్త వెనక్కు తగ్గింది. ఇక, ఈ గొడవకు సంబంధించి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు టీటీఈ. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. 

English Title
Jabardast Shaking Seshu in Colliding with TTE
Related News