జైలు నుంచి జగ్గారెడ్డి విడుదల..

Updated By ManamMon, 09/24/2018 - 19:23
Jagga reddy, Bail release, Chanchalguda jail, Gandhi bhavan, KCR
  • గాంధీభవన్‌లో మీడియా సమావేశం.. 

Jagga reddy, Bail release, Chanchalguda jail, Gandhi bhavan, KCRహైదరాబాద్: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. సోమవారం న్యాయస్థానం జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు. ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేయడమే తాను చేసిన నేరమని, రాజకీయ కక్ష సాధింపుతోనే తనను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

కక్ష సాధింపుతో 14ఏళ్ల నాటి కేసును తిరగదోడారని అన్నారు. ఈ కేసులో నిర్దోషిగా బయటికి వస్తానన్న నమ్మకముందని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలపై ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడమే కేసీఆర్ లక్ష్యమని జగ్గారెడ్డి విమర్శించారు. 

English Title
Jagga reddy released on bail from Chanchal guda jail
Related News