'జై సింహా' ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్‌

Updated By ManamTue, 02/13/2018 - 21:39
jai simha

jai simhaబాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'జై సింహా'. న‌య‌న‌తార‌, హ‌రిప్రియ‌, న‌టాషా దోషి హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకి ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాగా, సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా.. వ‌సూళ్ళ ప‌రంగా హిట్ స్థాయికి చేరుకుంది. చిత్ర బృందం అందించిన అధికారిక క్లోజింగ్ షేర్స్ ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.28.25 కోట్ల షేర్ రాబ‌ట్టుకున్న ఈ మూవీ.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.35.85 కోట్ల షేర్ రాబ‌ట్టుకుంద‌ని చిత్ర వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ వాల్యూ రూ.27 కోట్లు ఉన్న ఈ సినిమా.. ఈ లెక్క‌ల‌ ప్రకారం హిట్ స్థాయికి చేరుకున్న‌ట్లే.  

English Title
'jai simha' final collections
Related News