జియో యూజర్లకు శుభవార్త!

Updated By ManamWed, 08/15/2018 - 15:54
Jio GigaFiber registrations, register online, Jio broadband
  • జియో ‘గిగాఫైబర్’ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

  • నేటి నుంచే ప్రీ-బుకింగ్స్ ఆరంభించిన జియో రిలయన్స్

Jio GigaFiber registrations, register online, Jio broadbandముంబై: రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న జియో గిగాఫైబర్‌ బ్రాండ్‌బ్యాండ్ ఆన్‌లైన్ ప్రీ-బుకింగ్స్‌ ప్రారంభయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్‌ జియో బుధవారం (ఆగస్టు 15) నుంచి ఆప్టికల్‌ ఫైబర్‌ బ్రాండ్‌బ్యాండ్‌ సేవలకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. 4జీ సేవలతో వినియోగదారులను ఆకట్టుకున్న రిలయన్స్ సంస్థ జియో నెట్‌వర్క్‌తో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించనుంది. అత్యంత వేగంగా పనిచేసే ఈ గిగాఫైబర్ బ్రాండ్‌ బ్యాండ్ సేవలను ఆఫీసుల్లోనూ లేదా ఇంట్లోనూ కనెక్ట్ చేసుకోవచ్చు.
Jio GigaFiber registrations, register online, Jio broadbandఆసక్తి ఉన్నవారంతా జియో గిగాఫైబర్ కనెక్షన్ కోసం.. గిగాఫైబర్.జియో.కామ్ (gigafiber.jio.com)లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గిగో ఫైబర్ కనెక్షన్లను దాదాపు 1,100 నగరాల్లో విస్తరింపజేయనున్నట్టు రిల్ సంస్థ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గిగోఫైబర్ కనెక్షన్లకు సంబంధించి ఏ ప్రాంతం నుంచి దరఖాస్తులు ఎక్కువగా వస్తాయో అక్కడే మొదటగా సర్వీసును ప్రారంభిస్తామని జయో సంస్థ వెల్లడించింది. కాగా, ప్రస్తుతానికి జియో గిగాఫైబర్‌ను ఇళ్లలో ఉపయోగించే‌ వినియోగదారులకు నెలకు రూ.1000 ప్లాన్‌తో సెకనుకు వంద మెగాబైట్స్ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ అందించనుంది. గృహ వినియోగదారులకు పది రెట్ల వేగంతో ఇంటర్నెట్‌ అందించనుండగా, గిగాఫైబర్‌ ధరను ఇంకా వెల్లడించాల్సి ఉంది. 

‘గిగోఫైబర్’ కనెక్షన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
1. జియో బ్రాండ్ బ్యాండ్‌ కంపెనీ వెబ్‌సైట్‌ jio.com లోకి వెళ్లి gigafiber ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడి నుంచి gigafiber.jio.com వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతుంది. 
2. గిగాఫైబర్ వెబ్ పేజీలో మీ వ్యక్తిగత వివరాలు (ఇంటి చిరునామా, ఆఫీసు చిరునామా)ను నింపాల్సి ఉంటుంది. 
3. ఆ తరువాత మరో పేజీలో మీ వ్యక్తిగత వివరాలు (పూర్తి పేరు, మొబైల్ నెంబర్)ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాంతో రిజిస్ట్రర్డ్ ఫోన్ నెంబరుకు ఓటీపీ (వన్‌టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది.
4. నమోదు ప్రక్రియలో భాగంగా మీకో సంక్షిప్త సమాధానం వస్తుంది.. ‘‘జియో గిగోఫైబర్ మీ ప్రాంతంలో సర్వీసు అందించేందుకు మీకో ఆహ్వానం మాత్రమే. మీ వ్యక్తిగత వివరాలన్నీ jio.com వెబ్‌సైట్‌లో అత్యంత గోప్యంగా ఉంచడం జరుగుతుంది’’ అని స్పష్టంగా ఉంటుంది. 
5. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నెంబరును రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేయాల్సి ఉంటుంది. దాంతో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. గిగాఫైబర్‌కు సంబంధించిన రిలయన్స్ జియో యాడ్స్ నమోదు చేసుకున్న వినియోగదారులకు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి.  

English Title
Jio GigaFiber registrations now live: Here's how to register online for Jio broadband
Related News