చెర్రీ ప్రొడక్షన్స్‌లో ఎన్టీఆర్..?

Updated By ManamSat, 09/22/2018 - 11:09
Ram Charan, NTR

Ram Charan, NTRకొణిదెల ప్రొడక్షన్స్‌ను ప్రారంభించిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.. మొదటి చిత్రంగా తన తండ్రి చిరంజీవితో ‘ఖైదీ నంబర్.150’ను తెరకెక్కించారు. ఆ చిత్ర విజయం ఇచ్చిన ఊపుతో చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’ని కూడా తన బ్యానర్‌లోనే నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ బ్యానర్‌లో తన ఫ్యామిలీ హీరోలతో పాటు మిగిలిన హీరోలతో కూడా సినిమాలను నిర్మించాలనుందని ఓ సందర్భంలో వెల్లడించిన రామ్ చరణ్ అందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముందుగా తన స్నేహితుడు ఎన్టీఆర్‌తో చెర్రీ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత చెర్రీతో కలిసి రాజమౌళి తెరకెక్కించే మల్టీస్టారర్‌లో నటించనున్నాడు. ఈ చిత్రం తరువాత వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ఓ చిత్రంలో ఎన్టీఆర్ నటించనుండగా.. మరోవైపు చెర్రీ బ్యానర్‌లో కూడా నటించనున్నాట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

English Title
Jr. NTR in Ram Charan's production




Related News